Asianet News TeluguAsianet News Telugu

ఇన్‌స్టాగ్రాం కొత్త అప్ డేట్.. ఇప్పుడు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు డైరెక్ట్‌ మెసేజ్‌..

ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వినియోగదారులను రెండు ప్లాట్‌ఫామ్‌లలో చాట్ చేయడానికి అనుమతిస్తుంది. అప్‌డేట్ చేసిన ఫీచర్, ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు త్వరలో అందుబాటులో రానుంది.

Facebook let users merge Instagram and Messenger chats with app update
Author
Hyderabad, First Published Aug 17, 2020, 5:32 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మెసెంజర్ చాట్‌లకు కొత్త  అప్ డేట్ అందిస్తుంది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వినియోగదారులను రెండు ప్లాట్‌ఫామ్‌లలో చాట్ చేయడానికి అనుమతిస్తుంది.

అప్‌డేట్ చేసిన ఫీచర్, ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు త్వరలో అందుబాటులో రానుంది. తాజా అప్ డేట్ తో ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు  చాట్ ఫీచర్‌ను లేదా డైరెక్ట్ మెసేజ్‌లను ఫేస్‌బుక్ మెసెంజర్‌తో విలీనం చేసే అవకాశాన్ని అందిస్తుంది,

తద్వారా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఫేస్‌బుక్ మెసెంజర్ ప్లాట్‌ఫామ్‌లో మెసేజెస్ పంపుకోవచ్చు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ లోగోను మెసెంజర్‌ లోగోగా మార్చారు.

also read  మద్యం హోం డెలివరీ చేయనున్న ఫ్లిప్‌కార్ట్.. స్టార్టప్ డియాజియోతో భాగస్వామ్యం.. ...

ఇప్పుడు  మెసేజ్‌లన్నీ కూడా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అవుతాయని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెన్‌బర్గ్‌ వెల్లడించారు.

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్  వాట్సప్ప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్ వన్ క్రాస్ చాట్ ఫంక్షనాలిటీ యాప్‌తో సహా సోషల్ నెట్‌వర్క్ మెసేజింగ్ సేవలను ఏకీకృతం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ను 2012 లో 1 బిలియన్ డాలర్లకు, 2014 లో వాట్సాప్‌ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios