Asianet News TeluguAsianet News Telugu

టెలికాం రంగంలో మరో సంచలనం...ఎయిర్‌టెల్‌తో అమెజాన్‌ జోడీ..?

భారతి ఎయిర్‌టెల్‌లో ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అమెజాన్ సుమారు 5% వాటాను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం భారతి ఏయిర్‌టెల్‌ దేశంలో రూ. 30కోట్ల వినియోగదారులతో మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా పేరొందింది. 

Amazon  to buy $2 billion stake in Bharti Airtel
Author
Hyderabad, First Published Jun 4, 2020, 5:49 PM IST

టెలికాం దిగ్గజం భారతీయ మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్‌లో 2 బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేయడానికి  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.కం చర్చలు జరుపుతోంది. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

భారతి ఎయిర్‌టెల్‌లో ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అమెజాన్ సుమారు 5% వాటాను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం భారతి ఏయిర్‌టెల్‌ దేశంలో రూ. 30కోట్ల వినియోగదారులతో మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా పేరొందింది. 

భారతీ ఎయిర్‌టెల్‌ టెలికాం ప్రత్యర్థి రిలయన్స్ జియోను పెట్టుబడులను ఆకర్శించడంలో దూసుకెళ్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబికి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్‌మెంట్‌  సంస్థ  బిలియన్ (100 కోట్ల )డాలర్ల  మెగా డీల్‌కు సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

also read రిలయన్స్ జియో రిచార్జ్ పై బంపర్‌ ఆఫర్ ..

రిలయన్స్ డిజిటల్ యూనిట్ ఇటీవలి కాలంలో ఫేస్ బుక్, కెకెఆర్ వంటి ఇతరు సంస్థలతో సహ 10 బిలియన్ డాలర్లను పెట్టుబడులను సేకరించింది.

భారతి ఎయిర్‌టెల్‌, ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఒప్పంద ఒప్పందాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై తామిప్పుడే స్పందించలేమని కొందరు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios