రిలయన్స్ జియో రిచార్జ్ పై  బంపర్‌ ఆఫర్ ..

ఈ ఆఫర్ కింద, రిలయన్స్ జియో వినియోగదారులు జూన్ నెలలో ఎలక్ట్రానిక్స్, దుస్తులు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండూ), రీఛార్జిపై డిస్కౌంట్ పొందవచ్చు.

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కొత్త రిలయన్స్ జియో 4 xబెనిఫిట్ ఆఫర్ రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ఫుట్‌వేర్‌, ఎజియో కూపన్ల ద్వారా కోనుగోళ్లపై (ఆన్‌లైన్,ఆఫ్‌లైన్ రెండూ) డిస్కౌంట్లు పొందవచ్చని సంస్థ తెలిపింది.


అయితే రీచార్జ్‌ చేసుకున్న ప్రతి కస్టమర్‌ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో జమ అవుతాయని, షాపింగ్ చేసేటప్పుడు కస్టమర్లు డిస్కోంట్లు పొందవచ్చని తెలిపింది. జూన్ నెలలో రు.249 ఇంకా ఆ పై అన్ని రీఛార్జ్ ప్లాన్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

రు.249 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జి  చేసుకునే రిలయన్స్ జియో కస్టమర్లు ఈ ఆఫర్ కూపన్లను పొందవచ్చు. ఈ కూపన్లు వినియోగదారుల రిలయన్స్ మైజియో యాప్ కూపన్ల విభాగంలో జమవుతాయి.

also read జూమ్ యాప్ యూజర్లకు షాక్..ఇకపై సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే సేవలు..

 ఇది వరకే రీచార్జ్‌ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌కు అర్హులని సంస్థ ప్రకటించింది. అయితే అడ్వాన్స్ రీచార్జ్‌ చేసుకున్న వారు మై జియో యాప్‌లోని మై ప్లాన్స్‌ సెక్షన్‌లో ఆఫర్‌కు సంబంధించిన వివరాలుంటాయని తెలిపింది.

వారు చేయాల్సిందల్లా పైన తెలిపిన రీఛార్జ్ చేయడమే. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, ఇది జూన్ 1 నుండి జూన్ 30 మధ్య చేసుకునే రీఛార్జ్‌లపై మాత్రమే వర్తిస్తుంది.