టెలికాం కంపెనీల మధ్య పెరగనున్న పోటీ..ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్ కారణాలివే..

 ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన మార్కెట్ విస్తరించడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ రంగంలో భారీగా మార్కెట్ ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అమెజాన్ లాభాల పంట పండినట్లేనని భావిస్తున్నారు.
 

Amazon  is in early-stage talks to buy a stake worth at least $2 billion in Bharti Airtel

న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలపై విదేశీయులకు ప్రస్తుతం ఆసక్తి పెరుగుతోంది. పలు దిగ్గజ వ్యాపార సంస్థలు ఇప్పుడు దేశంలోని అనేక సంస్థల్లో వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. 

అందులో ప్రత్యేకించి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన మార్కెట్ విస్తరించడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ రంగంలో భారీగా మార్కెట్ ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అమెజాన్ లాభాల పంట పండినట్లేనని భావిస్తున్నారు.

అందుకే అమెజాన్ ఇక్కడ వివిధ రూపాల్లో 650 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో పేర్కొంది. అలెక్సా పేరుతో వాయిస్‌ యాక్టివేటెడ్‌ ఇంటరాక్టివ్‌ స్పీకర్లు, అమెజాన్‌ ప్రైమ్‌ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌, మొబైల్‌ వ్యాలెట్‌, క్లౌడ్‌ సేవలు సైతం అమెజాన్ అందిస్తోంది.

ఈ నేపథ్యంలో 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌లో ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు టెలికాం రంగ ప్రవేశ ప్రయత్నాలూ అమెజాన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎయిర్ టెల్‌లో అమెజాన్ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ మార్కెట్ పరంగా ఎయిర్ టెల్‌లో 5శాతం వాటాను అమెజాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రెండు సంస్థలు స్పందించేందుకు నిరాకరించినా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం. 

మనదేశంలో డిజిటల్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో 300మిలియన్లకు పైగా వినియోగదారులతో మూడో స్థానంలో ఉన్న అతిపెద్ద టెలికాం సంస్థగా చెలామణి అవుతున్న ఎయిర్ టెల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేస్తున్నట్లు ఆ ఆంగ్ల దినపత్రిక కథనం తెలిపింది. 

also read  రిలయన్స్ జియో రిచార్జ్ పై బంపర్‌ ఆఫర్ ..

దీని ప్రకారం అమెజాన్-ఎయిర్ టెల్ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ప్రణాళిక బద్ధమైన పెట్టుబడులపై చర్చలు పూర్తయితే అమెజాన్, ఎయిర్ టెల్‌లో 5శాతం వాటాను కొనుగోలు చేయడం ఖాయమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.

దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌కు 30 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. నాలుగేళ్ల క్రితం దేశంలో నంబర్ వన్ టెలికాం కంపెనీగా ఉన్న ఎయిర్‌టెల్‌కు.. రిలయన్స్‌ జియో ఎంట్రీతో కష్టాలు మరింత పెరిగాయి. క్రమంగా మార్కెట్‌ వాటాను కోల్పోతూ వచ్చింది. 

ఫేస్‌బుక్‌ సహా పలు అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులతో మరింత బలోపేతమవుతున్న జియోతో పోటీపడేందుకు ఎయిర్‌టెల్‌కు అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజ పెట్టుబడులు ఎంతైనా అవసరమని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. 

భారత టెలికాం మార్కెట్లోకి ప్రవేశించేందుకు అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు తహతహలాడుతున్నాయి. ఫేస్‌బుక్‌ ఇప్పటికే జియోలో రూ.43 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 10% వాటా దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌ సైతం జియోలో వాటాపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. 

దాంతో గూగుల్‌.. వొడాఫోన్‌ ఐడియాలో వాటా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు నెలకొన్నాయి. తాజాగా అమెజాన్‌ కూడా ఈ జాబితాలోకి చేరింది. ఈ టెక్‌ దిగ్గజాల పెట్టుబడుల దన్నుతో మున్ముందు టెలికాం కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వాటి సేవల విస్తరణకూ దోహదపడనుందని నిపుణులు అంటున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios