ఆపిల్ స్మార్ట్ ఫోన్స్ లేదా ఆపిల్  డివైజెస్ కొనాలనుకుంటున్నారా అయితే ఇదే కరెక్ట్ టైమ్. అమెజాన్ ఇండియా ఆపిల్ డేస్ సెల్ వచ్చేసింది. ఈ సెల్ ద్వారా అమెజాన్ సైట్‌లో ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి ఫోన్‌లపై తగ్గింపు ధరలను అందిస్తుంది. ఆపిల్ ఐప్యాడ్ సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ పై విభిన్న డీల్స్, ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ఇండియాలో ఆపిల్ డేస్ సెల్ ఈ రోజు అర్ధరాత్రి ప్రారంభమై జూలై 25 వరకు కొనసాగుతుంది.

అమెజాన్‌లో ఆపిల్ డేస్ సేల్ ఆఫర్లు

సరికొత్త ఐఫోన్ సిరీస్‌తో ప్రారంభించి ఐఫోన్ 11  64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ ధర రూ.62,900 రూపాయలు, దీని అసలు ధర 68,300 రూపాయలు. అంటే రూ. ఆపిల్ డేస్ సెల్ ద్వారా 5,400 రూపాయలు తగ్గింపు ఇవ్వబడుతుంది. అమెజాన్ ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మాక్స్ ధరల తగ్గింపులను పేర్కొనలేదు, కానీ  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 4,000 తగ్గింపు అందిస్తుంది.

also read ఇండియాలో వివో డిజైన్‌, మాన్యుఫాక్చర్ సెంటర్‌.. ...

ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ ధర ఆపిల్ డేస్ సెల్ సందర్భంగా 41,500 రూపాయలకు లభిస్తుంది. ప్రస్తుతం, ఫోన్ ధర రూ. 41,999, అంటే రూ. 500 సెల్ సమయంలో తగ్గింపు ఇస్తుంది. ఐఫోన్ 7 సిరీస్ కూడా ఈ సెల్ సమయంలో ఆకర్షణీయమైన ధరకే జాబితా చేసింది. ఆపిల్ సెల్ ద్వారా  జీరో ఈ‌ఎం‌ఏ ఆప్షన్ తో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి అదనపు తగ్గింపు వంటి ఫైనాన్స్ ఆప్షన్ కూడా అందిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది.

ఆపిల్ డేస్ సెల్ సమయంలో, ఆపిల్ ఐప్యాడ్ సిరీస్ పై రూ. 5,000 డిస్కౌంట్, ఆపిల్ వాచ్ సిరీస్ 3 పై ఫ్లాట్ డిస్కౌంట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 1,000 కాష్ బ్యాక్ అందిస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు కూడా ఆపిల్ మాక్‌బుక్ ప్రో కొనుగోలుపై 7,000 ఇన్స్టంట్ తగ్గింపు పొందుతారు. అన్ని సెల్ ఆఫర్‌లు ఈ రోజు అర్ధరాత్రి అమెజాన్ ఇండియాలో ప్రత్యేక పేజీలో ప్రత్యక్ష అవుతాయి.