న్యూ ఢీల్లీ: స్థానికంగా డివైజెస్ అభివృద్ధి చేయడానికి స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారతదేశంలో పారిశ్రామిక డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని,అలాగే ఫ్యాక్టరీలో ఉద్యోగుల సంఖ్యను 50,000 కు పెంచనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు.

స్మార్ట్ ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 3.3 కోట్ల యూనిట్ల నుంచి 12 కోట్లకు పెంచడానికి కంపెనీ భారతదేశంలో 7,500 కోట్ల పెట్టుబడులను  పెట్టనున్నట్లు ప్రకటించినట్లు వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ తెలిపారు.

also read సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ యూసర్లకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌.. ...

"అతి త్వరలో మేము భారతదేశంలో కూడా మా పారిశ్రామిక రూపకల్పన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ డిజైన్ సెంటర్ భారతీయ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. భారతదేశంలో రూపొందించిన, తయారు చేయబడిన వివో మొదటి ఉత్పత్తి 2020-21లో అందుబాటులోకి వస్తుంది "అని మరియా చెప్పారు.

వివో జనవరి-మార్చి త్రైమాసికంలో 21 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ సెల్  బ్రాండ్ గా అవతరించిందని  అనిమార్కెట్ పరిశోధన సంస్థ ఐడిసి తెలిపింది.