భారత్ చైనా సరిహద్దుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా భారత ప్రభుత్వం 117 చైనీస్ యాప్‌లతో పాటు పబ్‌జీ మొబైల్‌ను గత నెలలో  నిషేధించింది. ఇందులో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ రెండూ ఉన్నాయి. భారత ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుండి పబ్‌జీ మొబైల్ తొలగించింది.

పబ్‌జీ గేమ్ వారి ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన వారికి ఆడవచ్చు. తాజా నిర్ణయంతో ఇకపై ఈ అవకాశం యూజర్లకు పూర్తిగా రద్దు కానుంది. అయితే ఇండియాలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్ ఇకపై పూర్తిగా నిషేధం కానుంది.  పబ్‌జీ మొబైల్ సేవలన్నింటినీ ఇండియాలో శాశ్వతంగా నిలిపివేయనుంది.

ఈ మేరకు పబ్‌జీ ఫేస్‌బుక్ పేజీలో ఒక అధికారిక ప్రకటన చేసింది. ఈ రోజు అంటే అక్టోబర్ 30,2020 నుంచి వినియోగదారులందరికీ పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ కు సంబంధించి అన్ని సేవలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.  

also read హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌.. ...

పబ్‌జీ మొబైల్ వినియోగదారుల గోప్యత, డేటాను రక్షించిందని హైలైట్ చేసింది. గోప్యత, భద్రత కారణాలను ఎత్తి చూపుతూ భారత ప్రభుత్వం పబ్‌జీ మొబైల్ గేమ్ తో సహ ఇతర చైనీస్ యాప్‌లను గతంలో నిషేధించిన సంగతి మీకు తెలిసిందే.

"వినియోగదారు డేటాను రక్షించడం ఎల్లప్పుడూ ప్రధానమైనది. మేము ఎల్లప్పుడూ భారతదేశంలో వర్తించే డేటా రక్షణ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉన్నాము. మా గోప్యతా విధానంలో వెల్లడించిన విధంగా వినియోగదారులందరి గేమ్‌ప్లే సమాచారం పారదర్శకంగా ప్రాసెస్ చేయబడుతుంది ”అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

 పబ్‌జీ మొబైల్ భారతదేశంలో తన సేవలను తిరిగి ప్రారంభించడానికి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో వంటి టెల్కోలతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి.