Asianet News TeluguAsianet News Telugu

మండే మానియా.. ఒక్కరోజే లక్ష కోట్లు పెరిగిన అమెజాన్ సి‌ఈ‌ఓ సంపద..

బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం డిసెంబర్ 2018 నుండి అత్యధికంగా వినియోగదారులలో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగిన తరువాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ షేర్ల విలువ అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో 7.9% పెరిగింది.

amazon ceo Jeff Bezos gets $13 billion richer in 1 day
Author
Hyderabad, First Published Jul 22, 2020, 12:47 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్ జూలై 20న అంటే కేవలం ఒక రోజులో తన నికర విలువ 13 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం డిసెంబర్ 2018 నుండి అత్యధికంగా వినియోగదారులలో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగిన తరువాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ షేర్ల విలువ అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో 7.9% పెరిగింది.

2018 డిసెంబర్‌ తర్వాత అమెజాన్‌ షేర్ల విలువ ఇంత భారీగా పెరుగడం ఇదే ప్రథమం. ప్రపంచంలోని సంపన్నుల వివరాలను బీబీఐ 2012 నుంచి వెల్లడిస్తున్నది. ఈ ఎనిమిదేండ్లలో ఓ వ్యక్తి నికర సంపద ఒక్క రోజే ఇంత గణనీయంగా పెరుగడం ఇదే తొలిసారి.

కరోనా వైరస్ మహమ్మారి  వ్యాప్తి ప్రారంభం నుండి మూడు నెలల కాలంలో టెక్నాలజీ స్టాక్స్ లాభపడటంతో అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ భారీ లాభాలను పొందారు. కరోనా మహమ్మారి కారణంగా యుఎస్ ఆర్థిక వ్యవస్థ కూడా పెద్ద దెబ్బతింది.

టు థింక్-ట్యాంకుల డేటా ప్రకారం ఈ కాలంలో టెక్ స్టాక్స్‌లో ర్యాలీ వెనుక అమెరికాలో 600 మందికి పైగా బిలియనీర్లు ధనవంతులయ్యారు. అమెజాన్ ఇంక్ వాటా సోమవారం 7.93 శాతం పెరిగి అంటే 234.87 డాలర్లు పెరిగి మొత్తం 3,196.84 డాలర్లకు చేరుకుంది.

also read కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త ఎం.డి & సిఇఒగా రమేష్ బాబు ...

ఈ పెరుగుదలతో జెఫ్ బెజోస్ మొత్తం సంపద ఇప్పుడు 189.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం ఈ  ఒక్క సంవత్సరంలోనే 74 బిలియన్ డాలర్లు పెరిగింది. స్టాక్ ధరల పెరుగుదలతో జెఫ్ బెజోస్ మాజీ భార్య మాకెంజీ బెజోస్ సంపదను కూడా 4.6 బిలియన్లకు పెంచింది.

ఆమె ఇప్పుడు  బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 13వ ధనవంతురాలు. జెఫ్ బెజోస్  నికర విలువ ఇప్పుడు ఎక్సాన్ మొబిల్, నైక్, మెక్ డోనాల్డ్స్ సహా యుఎస్ లోని కొన్ని అతిపెద్ద దిగ్గజాల మొత్తం ఎం-క్యాప్స్ కంటే ఎక్కువ.

అంతేకాక అమెజాన్ ఇంక్ సి‌ఈ‌ఓ  ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు బాగానే ఉండొచ్చని అంచనా. ఇటీవలి నివేదిక ప్రకారం అతను 2026 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ కాగలడని అంచనా వేసింది. అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్ 62 ఏళ్లు వచ్చేసరికి ఆ ఘనతను సాధించవచ్చు.

చిన్న వ్యాపారాలకు సలహాలు ఇచ్చే కంపారిసున్ 'ది ట్రిలియన్ డాలర్ క్లబ్' నివేదిక ప్రకారం మాకెంజీ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత 38 బిలియన్ డాలర్లను కోల్పోయినప్పటికీ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించాడు.

2028 నాటికి ఎవర్‌గ్రాండే గ్రూప్ ఛైర్మన్ జు జియాయిన్ రెండవ ట్రిలియనీర్‌గా అవతరిస్తారని నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 2036 సంవత్సరంలో 51 సంవత్సరాల వయసుతో అతి పిన్న వయసు ట్రిలియనీర్‌గా మారతారని నివేదిక పేర్కొంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios