భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ తన సంస్థ నుంచి రియల్ మీ ఎక్స్ 50 5జీ పేరుతో జనవరి 7న ఫోన్ ను విడుదల చేయనుంది.ఇందుకు సంబంధించి రీయల్ మీ ఓ టీజర్ ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ గాడ్జెట్స్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 

also read మొబైల్ ను ఎన్ని గంటలు వాడుతున్నామో తెలుసా?

టీజర్ లో ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది.  స్క్రీన్ మీద డ్యూయల్ పంచ్ హోల్స్ తో పాటు  స్క్రీన్ పై భాగంలో ఎడంవైపు రెండు సెల్ఫీ కెమెరాలను అమర్చింది. టీజర్ లో స్క్రీన్ మీద ఉన్న డ్యూయల్ పంచ్ హోల్స్ పిల్ షేప్ లో మోడల్ ను డిజైన్ చేసింది. ఫోన్ వ్యాల్యూమ్ రాకర్స్ డిస్ ప్లే ఎడమవైపు ఎడ్జ్ లో ఉన్నాయి.

ఇక బెజల్స్ సైతం చాలా చిన్నవిగా ఉండడంతో ఫోన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. పోలార్ కలర్ ఆప్షన్ తో పాటు బ్లూ గ్రేడియంట్ కలర్ తో ఫోన్ ను డిజైన్ చేశారు. రియల్ మీ ప్రకటించిన ప్రకారం ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయ్

చిప్ సెట్ – స్నాప్ డ్రాగన్ 765జీ

ఛార్జింగ్ సిస్టమ్ -30 డబ్ల్యూ వీఓఓసీ 4.0

సెన్సార్ – సోనీ  ఐఎంఎక్స్686

మెగా ఫిక్సల్  - 64

also read ఒప్పో నుండి కొత్త 6జి‌బి ర్యామ్ స్మార్ట్ ఫోన్... ధర ఎంతంటే ?

అయితే ఈ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ కూడా స్పెర్క్యూలేట్ అవుతున్నాయి.

ఫోన్ సైజ్ – 6.67 ఇంచస్, ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే

బ్యాటరీ – 4,500ఎంఏహెచ్

కెమెరా – డ్యూయల్ సెల్ఫీ కెమెరా మరియు 64-మెగా ఫిక్సల్ ప్రైమరీ లెన్స్ బేస్ డ్ క్వాడ్ రేర్ కెమెరా సెటప్

ర్యామ్స్ – త్రీ ర్యామ్ ప్లస్ స్ట్రాంగ్ ఆప్షన్

టాప్ ఎండ్ మోడల్ -8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్

కాస్ట్ – 28,000 ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కాస్ట్,  ఫీచర్స్ గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ రావాలంటే జనవరి 7వరకు వెయిట్ చేయాల్సిందే.