ఎయిర్‌టెల్ డబుల్ డేటా ఆఫర్..కేవలం రూ.98కే..
ఎయిర్‌టెల్ ఇప్పుడు 6 జిబి డేటాకి బదులుగా 12 జిబి హై-స్పీడ్ డేటాను రూ. 98 యాడ్ ఆన్ ప్యాక్‌పై ఇప్పుడు డబుల్ డేటా అందిస్తోంది. ఇంతకుముందు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ 6జిబి హై-స్పీడ్ డేటాను మాత్రమే అందించేది.
ప్రముఖ టెలికాం ఎయిర్‌టెల్ తన రూ. 98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు డబుల్స్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో 12జిబి హై-స్పీడ్ డేటా ఇస్తుంది. ఇంతకుముందు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ 6జిబి హై-స్పీడ్ డేటాను మాత్రమే అందించేది.
ఈ ప్లాన్ డేటా ప్రయోజనాలు మాత్రమే ఇస్తుంది. ఎటువంటి ఎస్‌ఎంఎస్ లేదా కాలింగ్ ప్రయోజనాలు అందించదు. ఎయిర్‌టెల్ రూ .500, రూ. 1,000, రూ. 5,000 రీఛార్జ్ పై వినియోగదారులకు ఎక్కువ టాక్‌టైమ్‌ను అందిస్తోంది.
ఇప్పటికే రిలయన్స్ జియో, వొడాఫోన్‌లు తమ వినియోగదారులకు ఇవే తరహా డేటా ప్రయోజనాలను అందిస్తున్నాయి. జియో రూ.101 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా యాడ్-ఆన్ ప్యాక్‌తో యూజర్లకు 12GB హై స్పీడ్ డేటాతో పాటు 1000 నిమిషాల నాన్ జియో వాయిస్ కాలింగ్ ప్రయోజనాల అందిస్తున్నది.
also read గూగుల్ పే..ఆర్‌బిఐకి హైకోర్టు నోటీసు..యుపిఐ పేమెంట్ నిలిపివేయాలని పిటిషన్...
జియోలో కూడా రూ. 30 రోజుల వాలిడిటీతో మీకు 30జిబి 4జి డేటాను రూ.151 “వర్క్ ఫ్రమ్ హోం” ప్యాక్ ద్వారా అందిస్తుంది. వొడాఫోన్ రూ.6 జీబీ డేటా, 28 రోజుల వాలిడిటీతో రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 500 రీఛార్జిపై రూ .423.73 టాక్‌టైమ్ బదులు రూ. 480 టాక్‌టైమ్‌ను అందిస్తుంది. రూ. 1,000 రీఛార్జి ద్వారా 847.46 టాక్‌టైమ్ బదులు ఇప్పుడు రూ. 960 టాక్‌టైమ్ అందిస్తుంది. రూ. 5,000 రీఛార్జ్ చేస్తే 4,237 టాక్‌టైమ్ బదులు 4,800 టాక్‌టైమ్ అందిస్తుంది.