ఏషియన్ గేమ్స్.. స్వర్ణం గెలిచిన రిక్షా డ్రైవర్ కూతురు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 30, Aug 2018, 11:00 AM IST
Wonder woman Swapna Barman overcomes pain barrier
Highlights

తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. ఏ రోజూ మూడుపూటలా కడుపు నిండా తినే స్తోమత కూడా వారికి లేదు. కానీ.. అలాంటి ఇంటి నుంచి వచ్చిన ఈ బంగారు తల్లి.. దేశానికే బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది.
 

ఏషియన్ గేమ్స్ లో భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్‌ దానిని సాధించింది. ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది.

బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా లాగుతాడు. అతను కూడా ఐదేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. సోదరుడు కట్టెలు కొట్టడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడిచింది. ఏ రోజూ మూడుపూటలా కడుపు నిండా తినే స్తోమత కూడా వారికి లేదు. కానీ.. అలాంటి ఇంటి నుంచి వచ్చిన ఈ బంగారు తల్లి.. దేశానికే బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది.

అది కూడా మామూలు క్రీడ కాదు. దీనిలో పతకం సాధించాలనేది భారత్ కి 66ఏళ్ల కళ. అన్ని సంవత్సరాలుగా సాధ్యపడని దానిని స్వప్న సాధించింది. కటి కాదు... రెండు కాదు... ఏడు. హైజంప్, లాంగ్‌జంప్, జావెలిన్‌ త్రో, షాట్‌పుట్, 100 మీ. 200 మీ. 800 మీ. పరుగు పోటీలు. వీటన్నింటీలోనో విజయం సాధించి. భారత్ చిరకాల కోరిక స్వప్న నిజం చేసింది.

రెండు రోజుల పాటు జరిగిన హెప్టాథ్లాన్‌లో ఏడు క్రీడాంశాల్లో స్వప్న మొత్తం 6,026 పాయింట్లు సాధించింది. హై జంప్‌ (1.82 మీ.), జావెలిన్‌ త్రో (50.63 మీ.)లలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్‌ (12.69 మీ.), లాంగ్‌ జంప్‌ (6.05 మీ.)లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులో 13.98 సెకన్లతో నాలుగో స్థానంలో, 200మీ. పరుగులో 26.08 సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్‌... అందులో (2ని.21:13సె.) నాలుగో స్థానంలో నిలిచినా... మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. చైనాకు చెందిన క్వింగ్‌లింగ్‌ వాంగ్‌ (5954 పాయింట్లు) రజతం, జపాన్‌ అథ్లెట్‌ యమసాకి యుకి (5873 పాయింట్లు) కాంస్యంతో సరిపెట్టుకున్నారు. 

స్వప్న గురించి మరో విషయం కూడా చెప్పాలి. అదేంటంటే.. అందరికీ కాళ్లకి ఐదు వేళ్లు ఉంటే.. స్వప్నకి ఆరు వేళ్లు ఉన్నాయి.  ఆరేసి వేళ్లున్న అమ్మాయి అయినా అబ్బాయైనా షూస్‌తో సౌకర్యంగా ఉండటం చాలా కష్టం. అయినా సరే ఆ కష్టాన్ని అదిగమించి మరీ స్వప్న విజయాన్ని సాధించింది.

 

read more related news

ఆసియా క్రీడలు: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

ఆసియా క్రీడల్లో చేజారిన స్వర్ణం...ఆర్చరీలో సిల్వర్ మెడల్ కైవసం

loader