త్వరలో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. యువ క్రికెటర్ పంత్ కి టీంఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ షాకిచ్చాడు.


త్వరలో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. యువ క్రికెటర్ పంత్ కి టీంఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ షాకిచ్చాడు. ప్రపంచ కప్ కి వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవసరం లేదని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ మెగా టోర్నీకి సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ధోని, బ్యాకప్‌ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌లు సరిపోతారని చెప్పుకొచ్చాడు. తాజాగా.. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. మిటెడ్‌ ఫార్మాట్‌లో పంత్‌ ఫామ్‌లో లేడని, గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4, 40 నాటౌట్‌, 28,3,1 పరుగులే అతని ప్రదర్శనను తెలియజేస్తున్నాయని తెలిపాడు.

ప్రపంచకప్‌ టోర్నీ చాలా ప్రధానమైనదని, ఇలాంటి టోర్నీలకు యువ ఆటగాళ్ల కన్నా.. అనుభవం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. సెలక్టర్లు పంత్‌ను పక్కనబెట్టి కార్తీక్‌ను ఎంపిక చేయాలని చెప్పుకొచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో నలుగురు పేసర్లు మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌ ఖలీల్‌ అహ్మద్‌, ఇద్దరు స్పిన్నర్లు చహల్‌, కుల్దీప్‌లతో భారత్‌ బరిలోకి దిగాలన్నాడు.