విమానాశ్రయంలోనే రెజ్లర్ వినేష్ ఫోగట్ నిశ్చితార్థం...పుట్టినరోజు వేడుక కూడా....

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 28, Aug 2018, 12:11 PM IST
Vinesh gets engaged at airport
Highlights

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్లు పతకాల పంట పండించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా ఓ మహిళా రెజ్లర్ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడం ఇదే మొదటిసారి. దీంతో వినేష్ ఫోగట్ ఏషియన్ గేమ్స్ చరిత్రలో నిలిచిపోయారు.

అయితే స్వర్ణంతో ఇండియాకు తిరిగివచ్చిన వినేష్ అభిమానులను మరో తిపి కబురు అందించారు. శనివారం ఇండోనేషియా నుండి డిల్లీకి తిరిగివచ్చిన ఈ రెజ్లర్ ఇంధిరాగాంధి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోనే నిశ్చితార్థం చేసుకుంది. తన ప్రియుడు సోమ్‌వీర్ రాటీతో నిశ్చితార్థం జరిగింది. ఐజిఐ విమానాశ్రయ గేటు వద్ద ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట రింగులు మార్చుకున్నారు.

అంతే కాదు అదే రోజు వినేష్ పుట్టిన రోజు ఉండటంతో అక్కడే కేక్ ను కూడా కట్ చేశారు. ఇలా వినేష్ పుట్టిన రోజు, నిశ్చితార్థం రెండూ విమానాశ్రయంలోనే జరుపుకోవడం విశేషం.

ఈ సందర్బంగా వినేష్ మాట్లాడుతూ...గత ఏడెనిమిది సంవత్సరాలుగా తాను సోమ్‌వీర్ ప్రేమించుకుంటున్నామని తెలిపారు. అతడు కూడా రెజ్లర్ కావడంతో క్రీడా పరంగా కూడా తనకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాడని తెలిపింది. త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు ఫోగట్ తెలిపారు.  
 
loader