టీమిండియాను వదలని మాల్యా.. వరుసగా మూడోరోజు మ్యాచ్‌కు హాజరు

First Published 10, Sep 2018, 1:54 PM IST
vijay mallya attend for 5th test
Highlights

క్రికెట్ అంటే పిచ్చిని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మరోసారి బయటపెట్టు్కున్నాడు. భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టును వీక్షించేందుకు మాల్యా స్టేడియానికి వచ్చాడు.

క్రికెట్ అంటే పిచ్చిని కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మరోసారి బయటపెట్టు్కున్నాడు. భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టును వీక్షించేందుకు మాల్యా స్టేడియానికి వచ్చాడు. తొలి రోజు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్న మాల్యా కారు దిగి లోపలికి వస్తుండగా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా మూడో రోజు ఆదివారం కూడా మాల్యా మైదానానికి వెళ్లాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు టీమిండియాను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని మాల్యా కోరాడు. అయితే విజయ్ మాల్యా అభ్యర్థనను కేంద్రప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై నిరాశ చెందిన మాల్యా చివరి టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్నాడు. 

loader