Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా ప్రధాని హత్య కుట్ర కేసు...క్రికెటర్ సోదరుడి అరెస్ట్

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సలాన్ ఖవాజా మరోసారి కటకటాల పాలయ్యాడు. ప్రధాని మార్క్ టర్నబుల్ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ తప్పుడు సమాచారం అందించి జైలుపాలైన ఖవాజా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఆయితే తాజాగా సాక్షులను ప్రభావితం చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆయన్ని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
 
Usman Khawaja's Brother Re-Arrested For pm murder case
Author
Sydney NSW, First Published Dec 28, 2018, 6:58 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సలాన్ ఖవాజా మరోసారి కటకటాల పాలయ్యాడు. ప్రధాని మార్క్ టర్నబుల్ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ తప్పుడు సమాచారం అందించి జైలుపాలైన ఖవాజా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఆయితే తాజాగా సాక్షులను ప్రభావితం చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆయన్ని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అర్సలాన్ ఖవాజాకు, శ్రీలంకు చెందిన నిజాముద్దిన్ కు ఓ అమ్మాయి విషయంతో విబేధాలు తలెత్తాయి. దీంతో నిజాముద్దిన్ పై అర్సలాన్ పగ పెంచుకున్నాడు. దీంతో అతడిని ఎలాగైన దెబ్బతీయాలని ఓ పథకం రచించాడు. 

ఆస్ట్రేలియా ప్రధాని హత్యకు టర్న్ బుల్ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని...అందుకు నిజాముద్దిన్ వారికి సహకరిస్తున్నాడంటూ అర్సలాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి మాటలు నమ్మిన పోలీసులు నిజాముద్దిన్ ను అరెస్టు చేసి విచారించింది. చివరకు నిజాముదీన్‌కు ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని తేలడంతో పోలీసులు విడిచిపెట్టారు. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పదారి  పట్టించడంతో పాటు ో అమాయకుడి అరెస్టుకు కారణమైన అర్సలాన్ ఖవాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కొద్దిరోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇటీవలే అర్సలాన్ బెయిల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు సాక్షులను ప్రభావితం చేస్తూ కేసును తప్పదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడన్న  ఆరోపణలతో మరోసారి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    

Follow Us:
Download App:
  • android
  • ios