టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం కూడా అనుమానమే! సీఈఓ కీలక వ్యాఖ్యలు
2021 జులై 23 న ఆరంభ వేడుకలతో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ సమయంలో టోక్యో ఒలింపిక్స్ క్రీడల సీఈఓ తోషిరో ముటో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి జపాన్‌కు చేరిన ఒలింపిక్ జ్యోతి యాత్ర నిలిచిపోయింది. ప్రజా సందర్శనకు ఒలింపిక్ జ్యోతి నోచుకోలేదు. కరోనా విలయతాండవం నేపథ్యంలో సంవత్సరం పాటు ఒలింపిక్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే!
2021 జులై 23 న ఆరంభ వేడుకలతో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ నూతన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ సమయంలో టోక్యో ఒలింపిక్స్ క్రీడల సీఈఓ తోషిరో ముటో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తామని కచ్చితంగా చెప్పలేమని అన్నాడు. ' వచ్చే ఏడాది జులైలో పూర్తిగా సాధారణ పరిస్థితుల్లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహిస్తామని ఎవరైనా కచ్చితంగా చెప్పగలరని నేను అనుకోవటం లేదు. వచ్చే ఏడాది కచ్చితంగా నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు మా మద్ద స్పష్టమైన సమాధానం లేదు' అని సీఈఓ తోషిరో ముటో అన్నారు.
విలేకరుల సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు తోషిరో ఈ విధంగా స్పందించారు. ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. దీంతో ఈ సమయంలో నిర్వహణకు అన్ని సన్నద్ధం చేయగలం.
వచ్చే ఏడాది ఒలింపిక్స్ సమయానికి కరోనా వైరస్ మహమ్మారిపై మానవాళి విజయం సాధిస్తుందని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ప్రత్యామ్నాయ ఆలోచనలకు తావులేకుండా, వచ్చే ఏడాది షెడ్యూల్ కోసం మేం సర్వశక్తులా ప్రయత్నిస్తున్నామని అన్నాడు.
కోవిడ్-19పై పోరాటంలో చికత్స పద్దతుల అభివృద్ది, వ్యాక్సిన్ ఆవిష్కరణల కోసం మానవాళి తన జ్ఞానాన్ని, టెక్నాలజిని ఒక్కచోటికి చేర్చాలి' అని తోషిరో అభిప్రాయపడ్డారు. జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహణపై ఎంతో పట్టుదల ప్రదర్శించింది. దీంతో దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదు అని చూపెట్టడానికి ప్రధాని షింజో అబే కరోనా వైరస్ ని తక్కువ చేసే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి.
జపాన్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 5000 దాటింది. మృతులు 100 దాటారు. జపాన్ జనాభాలో వృద్దులు ఎక్కువ. కోవిడ్-19 ప్రభావం వృద్దులపై అధికంగా ఉండటంతో జపాన్ గతవారమే అత్యవసర పరిస్థితిని విధిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్ జులై 23-8 ఆగస్టు 2021లో నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయింది.