Asianet News TeluguAsianet News Telugu

Tokyo Olympics: న్యూజిలాండ్ పై 3-2 తో విజయం సాధించిన భారత హాకీ జట్టు

హాకీ మెన్స్ పూల్ ఏ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. 3-2 తేడాతో భారత హాకీ టీం న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. 

Tokyo Olympics: As Sreejesh Saves, Indian Hockey Beat New Zealand 3-2
Author
Tokyo, First Published Jul 24, 2021, 8:41 AM IST

హాకీ మెన్స్ పూల్ ఏ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ ను మట్టి కరిపించింది. 3-2 తేడాతో భారత హాకీ టీం న్యూజిలాండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి క్వార్టర్ చివరి వరకు ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ డిఫెన్సె ని బ్రేక్ చేసి భారత ఆటగాళ్లు తొలి క్వార్టర్ చివరన గోల్ ని సాధించి స్కోర్ సమం చేసారు. 

ఇక రెండవ క్వార్టర్ లో పెనాల్టీ కార్నర్ ద్వారా హర్మన్ ప్రీత్ కొట్టిన గోల్ తో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్లాక్ స్టిక్స్ భారత గోల్ పోస్ట్ పై వరుస దాడులు చేస్తున్నప్పటికీ... భారత గోలీ శ్రీజేష్ అద్భుత డిఫెన్సె భారత్ ని ఎప్పటికప్పుడు లీడ్ మైంటైన్ చేసేందుకు దోహద పడింది. 

ఇక మూడవ క్వార్టర్ లో భారత్ మరొక గోల్ తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 3-1 తో స్కోర్ ఉంచి ప్రత్యర్థికి మ్యాచ్ ను దూరం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ... భారత డిఫెన్సె ను ఛేదిస్తూ న్యూజిలాండ్ గోల్ ని సాధించి స్కోర్ ని 3-2కి చేర్చింది. 

ఇక ఆఖరు క్వార్టర్లో డ్రమాటిక్ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్,న్యూజిలాండ్ లు వరుస రెఫరల్ లు తీసుకోవడం తో పెనాల్టీ కార్నర్లు దక్కడం సర్వత్రా ఆసక్తిని నెలకొల్పింది. భారత జట్టు తన రెఫరల్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఆఖరున మ్యాచ్ ముగుస్తుందనగా న్యూజిలాండ్ ఆఖరి 24 సెకండ్లు మిగిలి ఉండగా పెనాల్టీ కార్నర్ పొందింది. 

ఏమీజరగబోతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... ఈ సమయంలో భారత కీపర్ శ్రీజేష్ తానెంత కీలక ఆటగాడినో మరోసారి నిరూపిస్తూ.... ఫుల్ స్ట్రెచ్ తో న్యూజిలాండ్ ఆశలకు గండి కొడుతూ... భారత్ ను తదుపరి పోటీలో నిలిపాడు. భారత్ తరుఫున శ్రీజేష్ బృందం డిఫెన్సె అమోఘం అని చెప్పాలి. టీం అంతా చాలా తెలివిగా ఆడుతూ మ్యాచ్ ను రక్తిగట్టించారు. 

ఆఖరు క్వార్టర్లో ఒక డైరెక్ట్ గోల్ పెనాల్టీ కార్నర్లను శ్రీజేష్ అద్భుతంగా ఆపడంతోనే భారత్ ఈ మ్యాచులో విజయం సాధించగలిగింది. శ్రీజేష్ ఆటను ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా అభినందించలేకుండా ఉండలేకపోయారంటే... అతని ఆటతీరు ఎలా ఉందొ మనం అర్థం చేసుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios