Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్: నిరాశపర్చిన తజిందర్‌‌పాల్ సింగ్.. షార్ట్ పుట్‌లోనూ...

తొలి ప్రయత్నంలో 19.99 మీటర్లు విసిరిన తజిందర్‌పాల్ సింగ్... మిగిలిన రెండు ప్రయత్నాలు విఫలం...

నేడు మూడు ఈవెంట్లలోనూ భారత జట్టుకి అచ్చిరాని ఫలితాలు...

Tokyo Olympics 2020: Indian Shot Put athlete Tajinderpal Singh toor failed to qualify CRA
Author
Tokyo, First Published Aug 3, 2021, 4:39 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం భారతజట్టుకి కలిసి రాలేదు. నేడు మూడు ఈవెంట్లలో భారత అథ్లెట్లు పోటీపడగా, మూడింటిలోనూ నిరాశే ఎదురైంది. షార్ట్ పుట్‌ ఈవెంట్‌లో పోటీపడిన భారత అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ థోర్, 12వ స్థానంలో నిలిచాడు.

తొలి ప్రయత్నంలో 19.99 మీటర్లు విసిరిన తజిందర్‌పాల్ సింగ్, ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ఈ మార్కును అధిగమించడంలో విఫలమై, ఫౌల్స్ చేశాడు. క్వాలిఫికేషన్స్‌లో పాల్గొన్నవారిలో టాప్ 6లో నిలిచినవారే, ఫైనల్స్‌కి అర్హత సాధిస్తారు. 

అంతకుముందు భారత వుమెన్ రెజ్లర్ సోనమ్ మాలిక్ తొలి రౌండ్‌లోనే ఓడింది. 62 కేజీల విభాగంలో మంగోలియా రెజ్లర్ బోలో‌తుయా కురెల్‌కుతో జరిగిన మ్యాచ్‌లో 2-2 తేడాతో ఓడింది సోనమ్ మాలిక్.  

41 ఏళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. బెల్జియంతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మెన్స్ హాకీ టీం 5-2 తేడాతో పోరాడి ఓడింది.

మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ అన్నూ రాణి నిరాశపరిచింది. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 60 మీటర్ల దూరం విసరాల్సిన దశలో అన్నూ రాణి అత్యుత్తమంగా 54.04 మీటర్లు మాత్రమే విసిరి 14వ స్థానంలో నిలిచింది.  

Follow Us:
Download App:
  • android
  • ios