సెమీ ఫైనల్‌లో 2-9 తేడాతో వెనకబడి, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన రవికుమార్ దహియా...

టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా అద్భుత పోరాటంతో ఫైనల్‌కి అర్హత సాధించాడు. సెమీ ఫైనల్‌లో కజికిస్తాన్‌కి చెందిన నురిస్లామ్ సనయెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి పీరియడ్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో కనిపించాడు రవికుమార్ దహియా.

అయితే బ్రేక్ తర్వాత ఎదురుదాడి చేసిన సనయెవ్ ఒకేసారి 8 పాయింట్లు సాధించి 2-9 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత వరుస మూడు, రెండు పాయింట్ల సాధించి 7-9 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు రవికుమార్ దహియా.. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు రవికుమార్ దహియా...

ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్ సుశీల్ కుమార్ తర్వాత ఫైనల్‌కి అర్హత సాధించిన భారత రెజ్లర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రవికుమార్ దహియా...