లేవర్ కప్ 2022 టోర్నీలో టీమ్ వరల్డ్ చేతుల్లో ఓడిన టీమ్ యూరప్... ఫేర్‌వెల్ మ్యాచ్‌లో ఎమోషనల్ అయిన రోజర్ ఫెదరర్...

తన ఆటతో అంతకుముంచి తన మంచి మనసుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. 24 ఏళ్ల పాటు టెన్నిస్ కోర్టును ఏలిన రోజర్ ఫెదరర్, కన్నీటితో తన కెరీర్‌కి ముగింపు పలికాడు... ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో 310 వారాల పాటు అగ్ర స్థానాన నిలిచిన రోజర్ ఫెదరర్, 237 వారాల పాటు ఏక ధాటిగా టాప్ పొజిషన్‌ని ఏలాడు.

24 ఏళ్ల ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో 103 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రోజర్ ఫెదరర్, 8 సార్లు వింబుల్డన్ టైటిల్స్ సాధించాడు. గత వారం టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన రోజర్ ఫెదరర్, లేవర్ కప్‌ 2022లో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజాలు, ఆత్మీయ మిత్రులు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఇద్దరూ కలిసి ‘ఫెడల్’గా టీమ్ యూరప్ తరుపున ఆడారు. ఫెడల్ జోడీ, టీమ్ వరల్డ్‌ తరుపున ఆడిన జాక్ సాక్, ఫ్రాన్సెస్ టీఫో చేతుల్లో 6-4, 6-7, 9-11 తేడాతో పోరాడి ఓడింది...

Scroll to load tweet…

రోజర్ ఫెదరర్‌తో పాటు ఆయన స్నేహితుడు, స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ ఇద్దరు టెన్నిస్ లెజెండ్స్‌ చిన్నపిల్లల్లా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి స్టేడియం అంతా చిన్నబోయింది. ఈ మ్యాచ్‌కి రోజర్ ఫెదరర్ కుటుంబం కూడా హాజరైంది.

తన భార్య మిర్కాకి థ్యాంక్స్ చెప్పాడు రోజర్ ఫెదరర్. ‘ఆమె కావాలంటే నన్ను ఎప్పుడో ఆపి ఉండేది, కానీ తను అలా చేయలేదు. నన్ను ఇన్నాళ్లు పాటు ఆడేలా ప్రోత్సహించింది. అన్ని వేళలా నాకు అండగా నిలిచింది. థ్యాంక్యూ... నాకు వాళ్లతో మాట్లాడే సమయం కూడా ఉండేది కాదు. ఎప్పుడూ మరింత బాగా ఆడాలని ప్రాక్టీస్ చేస్తూ, ఆలోచిస్తూ ఉండేవాడిని...

Scroll to load tweet…

నా కుటుంబం అంతా ఇక్కడుంది. నేను ప్రతీ దానికి మా మమ్మీని అంటూ ఉంటాడు. తన వల్లే ఇలా జరిగిందని నిందలు వేస్తూ ఉంటాను. అయితే తను లేకపోతే నేను ఇక్కడ లేను. నన్ను అన్నివేళలా ప్రోత్సహించిన నా పేరెంట్స్‌కి ఏం చెప్పినా తక్కువే... ’ అంటూ తన వీడ్కోలు స్పీచ్‌లో చెప్పుకొచ్చాడు రోజర్ ఫెదరర్...