Asianet News TeluguAsianet News Telugu

దాయాదుల మధ్య పోరు...హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్దమైంది. క్రికెట్ ప్రేక్షకులకు ఈ దాయాదుల మధ్య పోరంటే ఎప్పుడూ ఆసక్తే. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న మ్యాచ్ కోసం ఎప్పుడో టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్టేడియంలోని మొత్తం 25 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు ఆసియాకప్ నిర్వహకులు తెలిపారు. 
 

team india vs pakistan match in asia cup
Author
Abu Dhabi - United Arab Emirates, First Published Sep 19, 2018, 4:58 PM IST

ఆసియా కప్ లో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్దమైంది. క్రికెట్ ప్రేక్షకులకు ఈ దాయాదుల మధ్య పోరంటే ఎప్పుడూ ఆసక్తే. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న మ్యాచ్ కోసం ఎప్పుడో టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్టేడియంలోని మొత్తం 25 వేల టికెట్లు
హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు ఆసియాకప్ నిర్వహకులు తెలిపారు. 

 15 నెలల తర్వాత భారత్, పాక్ జట్లు తలపడుతుండటం కూడా ఈ మ్యాచ్ పై ఆసక్తిని మరింత పెంచాయి. ఆసియా కప్ లో పాకిస్థాన్ పై ఎప్పుడూ భారత్ దే పైచేయి. అయితే హంకాంగ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మంచి ఊపుమీదున్న పాకిస్థాన్ భారత జట్టుపై రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. హాంకాంగ్ పై ఆడిన జట్టులో మార్పులేవీ లేకుండా పాకిస్థాన్ బరిలోకి దిగనుంది.

అయితే ఇదే ప్రత్యర్థి హాకాంగ్ తో 18వ తేదీన జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అటు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను అంతలా ఆకట్టుకోలేకపోయింది. పసికూనపై శిఖర్ ధావన్, అంబటి రాయుడు మినహా మిగతా బ్యాట్ మెన్స్ ఎవరూ మంచి స్కోరు సాధించలేకపోయారు. అదేవిధంగా బౌలింగ్ విభాగం కూడా బలహీనంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని హాంకాంగ్ ఇంచుమించు చేదించినంత పని చేసింది. అయితే చివరకు చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు భారత జట్టు విజయం సాధించింది.

అయితే హాంకాంగ్ మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయినా ఆసియా కప్ పాకిస్థాన్ జట్టుపై భారత్ ది ఎప్పుడూ పైచేయిగా నిలుస్తోంది. దీంతో ఇదే రికార్డును కొనసాగిస్తూ మరోసారి దాయాదిని చిత్తుచేయాలని టీంఇండియా భావిస్తోంది. అందుకోసం హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు. ఇలా టీంఇండియాలో మార్పులుంటాయని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios