బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 307 పరుగులకు అలౌటై.. ఆసీస్‌కు 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 307 పరుగులకు అలౌటై.. ఆసీస్‌కు 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 151/3తో నాలుగో రోజు ఆట ప్రారంభిచిన భారత్‌‌కు పుజారా 71, రహానే 70 పురుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

లంచ్ విరామానికి పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగో రోజు మరో 156 పరుగులు జోడించి భారత్ 106.5 ఓవర్లలో 307 పరుగులకు అలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ నాథన్ లేన్ 6, మిచెల్ స్టార్క్ 3, హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.