అసలైన రసవత్తర పోరుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. భారత్ - పాక్ మ్యాచ్ ల కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా వరల్డ్ వైడ్ గా ఎంతో మంది క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది సీనియర్ క్రికెటర్ లు ఈ మ్యాచ్ పై అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. 

ఇరు జట్ల బలాబలాల గురించి మాట్లాడుతూ వారి సామర్ధ్యాల గురించి చర్చిస్తున్నారు. అయితే షోయబ్ అక్తర్ కూడా భారత్ పై పాక్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్యంగా టాస్ గెలిస్తే భారత్ కి ఓటమి తప్పదని సెహ్వాగ్ తో చర్చించాడు. సెహ్వాగ్ సైతం భారత్ ఓడిపోయే సమస్యే లేదని బౌలింగ్, బ్యాటింగ్ పటిష్టతను గుర్తు చేశారు. 

షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్ లైవ్ లో ఈ క్రికెటర్స్ చర్చించారు. ఇక పాక్ తో పాటు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టీమిండియాలు ఫెవెరెట్ టీమ్స్ అంటూ.. ఈ జట్లకు మాత్రమే వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు.ఎవరెన్ని చెప్పినా ఇండియాకి ఈ వరల్డ్ కప్ వచ్చి తీరుతుందని సెహ్వాగ్ సైతం సరదాగా కౌంటర్ ఇచ్చాడు.