నీ బిడ్డ రంగెంటీ.. డ్రగ్స్ పరీక్షలు.. సెరెనాను కృంగదీస్తోన్న జాతి వివక్ష

First Published 26, Jul 2018, 12:00 PM IST
Serena Williams slams doping test against Racial discrimination
Highlights

ఆటలో స్పీడ్.. గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు...4 ఒలింపిక్ బంగారు పతకాలు.. వివాదాలకు దూరం.. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రతిభకు ఇవి తార్కాణాలు.. ఆటలో ఎంతగా రాణిస్తున్నా నల్లగా ఉండే ఆమెకు ఇప్పటికీ జాతి వివక్ష వ్యాఖ్యలు తప్పడం లేదు

ఆటలో స్పీడ్.. గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు...4 ఒలింపిక్ బంగారు పతకాలు.. వివాదాలకు దూరం.. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రతిభకు ఇవి తార్కాణాలు.. ఆటలో ఎంతగా రాణిస్తున్నా నల్లగా ఉండే ఆమెకు ఇప్పటికీ జాతి వివక్ష వ్యాఖ్యలు తప్పడం లేదు. ఆటతోనే అందరికీ సమాధానం చెబుతున్నప్పటికీ.. ఆమెను మాటలతోనే హింసిస్తున్నారు..

నిండు గర్భిణీగా ఉన్నప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ ఏ రంగులో పుడతాడని జాతివివక్ష వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా కృంగదీశాయి. అయిన్పటికీ ప్రసవం తర్వాత అత్యంత వేగంగా కోలుకుని వింబుల్డన్‌ను తృటిలో చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ దిగ్గజ క్రీడాకారిణీ మరోసారి ఉద్వేగానికి గురైంది..

అమెరికా డోపింగ్ నిరోధక అధికారులు అందరి కన్నా తనకే ఎక్కువసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఇక్కడ కూడా తాను వివిక్షను ఎదుర్కొంటున్నానని కన్నీటి పర్యంతమైంది.. అధికారులకు డోపింగ్ పరీక్ష చేయాలనిపించే ప్రతి సారీ మొదటి ఛాయిస్ సెరెనానే.. అందరీకంటే ఎక్కువ సార్లు డోపింగ్ పరీక్షలను ఎదుర్కొన్నది తానే.. ఏదీ ఏమైనప్పటికీ చివరికి నేనన్నా ఆటలను స్వచ్ఛంగా ఉంచుతున్నానంటూ ‘‘staypositive’’ అని సెరెనా ట్వీట్ చేశారు. దీంతో ఆమెకు మద్ధతుగా టెన్నిస్ క్రీడాకారులు, అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.


 

loader