వింబుల్డన్ లో సెరెనాకు షాక్: 11వ నెంబర్ క్రీడాకారిణీ చేతిలో ఓటమి.. ఎవరీ కెర్బర్..?

Serena Williams Loss Wimbledon
Highlights

వింబుల్డన్‌లో సంచలనం నమోదైంది.. అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలయమ్స్‌ను 11వ ర్యాంక్ క్రీడాకారిణి అంజెలిక్ కెర్బర్ ఓడించి కప్ ఎగరేసుకెళ్లింది

వింబుల్డన్‌లో సంచలనం నమోదైంది.. అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలయమ్స్‌ను 11వ ర్యాంక్ క్రీడాకారిణి అంజెలిక్ కెర్బర్ ఓడించి కప్ ఎగరేసుకెళ్లింది.. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కెర్బర్ 6-3, 6-3 వరుస సెట్లతో సెరెనా విలియమ్స్‌ను ఓడించి వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి జర్మన్‌గా రికార్డు సృష్టించింది. అనవసర తప్పిదాలకు పోయి సెరెనా మ్యాచ్‌ను పొగొట్టుకుంది.

కచ్చితమైన సర్వీసులు, బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో కెర్బర్ చెలరేగిపోయింది..సెరెనా కనుక ఈ టైటిల్ గెలిచి ఉంటే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును అందుకునేది.. ఇప్పటి వరకు సెరెనా విలియమ్స్ ‌ఏడు వింబుల్డన్ టైటిళ్లు గెలిచారు.. 
 

loader