భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుుతున్నాయి. ఇలా దేశానికి సేవ చేస్తున్న  క్రీడాకారులను గౌరవించుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టినవే జాతీయ క్రీడా అవార్డులు. అయితే ప్రతిసారీ ఈ అవార్డుల కోసం ఆటగాళ్లను ఎంపికచేయడం వివాదానికి దారితీస్తోంది. దీంతో ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంది.  

జాతీయ, అంతర్జాతీయ సత్తాచాటికి ఆటగాళ్లకు రాజీవ్ ఖేల్ రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డులతో కేంద్ర సత్కరిస్తుంది. అయితే గతంలో ఒక్కో  అవార్డు కోసం అభ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియను ఒక్కో కమిటీ చూసుకునేది. ఇలా చాలా  కమిటీలు ఎంపిక ప్రక్రియను చేపట్టడం  వల్లే వివాదాలు చేలరేగుతున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీంతో ఆ ప్రక్రియలో మార్పులు చేపడుతూ నిర్ణయం తీసుకుంది. 

ఈ నాలుగు అవార్డుల కోసం అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతలను ఒకే కమిటీకి అప్పగించారు. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన 12 మందికి  చోటు కల్పించారు. అలా ఈ కమిటీలో ఇద్దరు ప్రముఖ క్రీడాకారులకుమ చోటు దక్కింది. మహిళా బాక్సర్ మేరీకోమ్ తో పాటు పుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాలకు ఈ కమిటీలో చోటు దక్కింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి ముకుందం శర్మ నేతృత్వం వహించనున్నారు. 

భారత జాతీయ క్రీడా హాకీని మరోస్థాయికి తీసుకెళ్లిన క్రీడాకారుడు స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. అలా ఆగస్ట్  29 వ తేదీన జరిగే ఈ క్రీడా దినోత్సవం రోజే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. అప్పట్లోపై ఆ కమిటీ అర్హులైన అభ్యర్ధలను ఎంపిక చేసి క్రీడా మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి వుంటుంది.