భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓ బాబుకు జన్మనిచ్చి ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం సానియా ఎప్పుడు బ్యాట్ పట్టుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు సానియా గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ ఏడాది ఆఖర్లో తిరిగి టెన్నిస్ బ్యాట్ పట్టుకుంటానని మీర్జా తెలిపారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సానియా మీర్జా మీడియాతో మాట్లాడుతూ..తానిప్పుడు యువ టెన్నిస్ క్రీడాకారిణిని కాదని.. కానీ టెన్నిసే నా జీవితమన్నారు.

ఆట తనకెంతో ఇచ్చిందని... ఆ ఆట నాలో ఇంకా మిగిలే ఉందేమో చూద్దామన్నారు. తనకు టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫే స్పూర్తి అని, పెళ్లయ్యాకా, తల్లిగా మారిని తర్వాత కూడా ఆమె టెన్నిస్‌లో ఎన్నో సంచలనాలు నమోదు చేశారన్నారు. తల్లిదండ్రులతో పాటు భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి తనను ఎంతగానో ప్రోత్సహించారని సానియా మీర్జా గుర్తు చేసుకున్నారు.  

నా కండిషనింగ్ ట్రయినర్ మరో పదిరోజుల్లో ఇక్కడికి వస్తున్నారని.. ముందు బరువు తగ్గి .. టెన్నిస్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌ను సాధిస్తానని ఆమె వెల్లడించారు. 32 ఏళ్ల సానియా మీర్జా చివరిసారిగా 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్‌లో ఆడింది. అక్కడే మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. అనంతరం గర్భం దాల్చడంతో గతేడాదంతా ఇంటికే పరిమితమయ్యారు.