సుధీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడి.. ప్రపంచంలో మరే ఇతర ఆటగాడికి లేనన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ గాడ్‌గా మన్ననలు అందుకున్నారు సచిన్ టెండూల్కర్. ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లు ఎంతగా కవ్వించినా.. సంయమనం కోల్పోకుండా బ్యాట్‌తోనే సమాధానం చెప్పేవాడు.

అన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా.. వివాదాలకు దూరంగా ఆటను కొనసాగించాడు సచిన్. అటువంటి సచిన్‌కు శత్రువులా అని మీరు అనుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. సుధీర్ఘకాలం టెస్ట్ క్రికెట్ ఆడిన సచిన్ తన క్రీడా జీవితంలో మొత్తం 492 మంది ప్రత్యర్థి ఆటగాళ్లను ఎదుర్కొన్నాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. శివనారాయణ్ చంద్రపాల్(426), జాక్ కలిస్(417), ముత్తయ్య మురళీధరన్ (415), మహేలా జయవర్ధనే (404) ఉన్నారు.