టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ పప్పులో కాలేశారు. ఆ తప్పుని గమనించిన నెటిజన్లు... విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచకప్ లో ఓటమన్నది లేకుండా దూసుకుపోతూ విజయాలు సాధిస్తున్న టీం ఇండియా.. రోహిత్ మిస్టేట్ తో ట్రోలింగ్ కి గురైంది. 

ఇంతకీ మ్యాటరేంటంటే...  ఛాంపియన్స్ ట్రోఫీ విజయానికి సంబంధించిన జ్ఞాపకాలు అంటూ ఓ ఫొటోను రోహిత్ ఆదివారం ట్వీట్ చేశాడు.  2013లో జూన్ 23వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా అందుకుంది. అయితే... 2013కి బదులు రోహిత్ శర్మ 2017 అని తప్పుగా పోస్టు చేశాడు.

వాస్తవానికి 2017 జూన్ 18నాటి ఫైనల్‌లో పాక్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. అయితే తన తప్పును గుర్తించిన రోహిత్.. దాన్ని డిలీట్ చేసి.. మళ్లీ కొత్తగా మరో పోస్ట్ పెట్టాడు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. కొంతమంది నెటిజన్లు దీనిపై కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మర్చిపోయిన చేదు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేశావా రోహిత్‌ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ‘‘అది 2013 రోహిత్ సార్.. 17లో మనం వేరే వాళ్లను గెలిపించాం’’.. ‘‘ఎందుకు పాతవాటిని గుర్తు చేస్తావన్నా’’ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.