Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్ కోసమే చివరి వన్డేలో ఆ కఠిన నిర్ణయం: రోహిత్

న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టి కరిపించి టీంఇండియా వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీంఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్యర్యపర్చింది. వెల్లింగ్టన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసి కూడా రోహిత్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇలా పిచ్ పరిస్థితులకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం  తీసుకోవాల్సి వచ్చిందో రోహిత్ వెల్లడించాడు. 
 
rohit sharma explanation about last odi toss issue
Author
Wellington, First Published Feb 5, 2019, 2:32 PM IST

న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టి కరిపించి టీంఇండియా వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీంఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్యర్యపర్చింది. వెల్లింగ్టన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసి కూడా రోహిత్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇలా పిచ్ పరిస్థితులకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం  తీసుకోవాల్సి వచ్చిందో రోహిత్ వెల్లడించాడు. 

నాలుగో వన్డేలో 92 పరుగులకే కుప్పకూలిన నేపథ్యంలో ఐదో వన్డేలో తమను తాము పరీక్షించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్ ను పరిశీలించగా బౌలర్లకు అనుకూలిస్తుందని తెలిసిపోయిందన్నారు. కానీ ప్రపంచ కప్ కు ముందు ఓ కఠినమైన మ్యాచ్ ఆడాలని భావించా. ప్రపంచ కప్ లో ఇలాంటి పరిస్థితులు ఎదురయితే ఎలా ఆడతామో తమను తాము పరీక్షించుకోడానికే కష్టమైనప్పటికి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ వివరించాడు. 

అయితే తాను అనుకున్నట్లే ఐదో వన్డేలో కఠిన పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భారత ఆటగాళ్లకు ఇప్పుడు బౌలర్లకు అనుకూలించే పిచ్ లపై ఎలా బ్యాటింగ్ చేయాలి, బంతి అతిగా స్వింగ్ అవుతున్నపుడు ఎలా ఎదుర్కోవాలో తెలిసిందన్నాడు.ఐదో వన్డే ద్వారానే అలాంటి పరిస్థితులపై అవగాహన వచ్చిందని రోహిత్ వివరించాడు.  

ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్ వంటి నాణ్యమైన జట్టును వారి దేశంలోనే ఓడించడం చాలా గొప్ప విజయమని రోహిత్ పేర్కొన్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్, ప్రపంచ స్థాయి బౌలర్లతో కూడిన ఆ జట్టును 4-1 తేడాతో ఓడించి భారత్ ప్రపంచ కప్ కు మెరుగ్గా సన్నద్దమయ్యిందన్నారు. గతంలె కంటే ఈసారి న్యూజిలాండ్ గడ్డపై మంచి క్రికెట్ ఆడామని రోహిత్ పేర్కొన్నాడు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios