కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్వతహాగా క్రీడాకారుడు అన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో పతకాన్ని కొట్టిన ఆయన కేంద్రమంత్రి అయినా క్రీడలు, క్రీడాకారుల పట్ల అభిమానాన్ని మాత్రం పక్కనపెట్టలేదు. ఈ అభిమానమే ఆయన్ను సర్వర్‌గా మార్చింది.

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులను ప్రొత్సహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ జకార్తాలో పర్యటిస్తున్నారు. ఆటగాళ్లను స్వయంగా కలుసుకుని వారితో ముచ్చటిస్తున్నారు. ఎవరు పతకం గెలిచినా వెంటన్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాజాగా ఆటగాళ్లంతా ఆహారాన్ని తీసుకునే చోటికి వెళ్లారు.. అయితే ఆయన వచ్చిన సంగతిని క్రీడాకారులు గుర్తించలేదు. ఇలోగా బౌల్స్‌లో సూప్, టీ పోసుకుని ప్లేటులో పెట్టుకుని ఆటగాళ్ల కోసం తీసుకెళ్లారు. మంత్రిని చూడగానే క్రీడాకారులు అవాక్కయ్యారు.. దీనికి సంబంధించిన  ఫోటో సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది.