ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది.  ఆ జట్టు తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబడ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.

బుధవారం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రబడ ఆడలేదు. స్వల్పగాయం కారణంగా ఆ మ్యాచ్ కు హాజరు కాలేదు. కాగా ఇప్పుడు పూర్తిగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.

త్వరలో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఐపీఎల్‌ నుంచి వెంటనే వచ్చేయాలని అతడికి దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కబురు పెట్టింది. ఫలితంగా అతడు ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

రబడ లేకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి గెలుపు కష్టంతో కూడుకున్న పనే. మొన్న మ్యాచ్ లో కూడా రబడ లేకపోవడం వల్లే ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిందనే వాదనలు వినిపించాయి. ప్రస్తుత ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి రబడ టాప్‌లో కొనసాగుతున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు దక్కించుకున్నాడు. కీలక దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టును వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదని రబడ పేర్కొన్నాడు.