ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో భాగంగా ఇవాళ(బుధవారం) యూపీ యోదాన్- తమిళ్ తలైవాస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీ పోరాడాయి. అయితే నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం ఎవరినీ వరించలేదు. ఈ సీజన్లో మొదటిసారి ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఈ ఉత్కంఠ పోరుకు పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికయ్యింది.

తమిళ్ తలైవాస్ రైడర్లలో రాహుల్ చౌదరి అత్యధికంగా 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఇక   షబీర్ 5,  మంజీత్ చిల్లర్, అజయ్ 3, రన్ సింగ్ 3 మోహిత్ చిల్లర్ 1 పాయింట్ సాధించారు. ఇలా రైడింగ్ లో 12, ట్యాకిల్స్ ద్వారా 10, ఓ సారి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 3 మొత్తం 28 పాయింట్లు సాధించింది. 

ఇక యూపీ యోదాస్ ఆటగాళ్లలో రిషంక్ 5, సుమిత్ 4 పాయింట్లతో రాణించారు. మోను గోయట్ 3, శ్రీకాంత్ 3, నితేశ్ 3, సురేందర్ గిల్ 3, అషు 2, అమిత్ 2 పాయిట్లు సాధించారు. ఇలా రైడింగ్  లో 13, ట్యాకిల్స్ లో 12, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 పాయింట్ సాధించింది. ఇలా యూపీ కూడా 28 పాయింట్లు మాత్రమే సాధించగలింది. 

ఇరు జట్లు సమానంగా 28-28 పాయింట్లు సాధించాయి.  దీంతో ఈ సీజన్ 7 లో మొదటిసారి ఓ మ్యాచ్ టై గా ముగిసింది.