MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • టీమిండియాకి శనిలా దాపురించారు.! అదే జరిగితే మూడో వన్డేలోనూ టీమిండియా ఖేల్ ఖతం

టీమిండియాకి శనిలా దాపురించారు.! అదే జరిగితే మూడో వన్డేలోనూ టీమిండియా ఖేల్ ఖతం

Prasidh Krishna: భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా బౌలింగ్ బలహీనత బయటపడింది. ప్రసిద్ద్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు సమర్పించుకుని అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా, సిరాజ్ లేకపోతే భారత బౌలింగ్ ఇంతేనని.. 

2 Min read
Author : Pavithra D
Published : Dec 05 2025, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మన బౌలింగ్ తేలిపోయింది..
Image Credit : Twitter\BCCI

మన బౌలింగ్ తేలిపోయింది..

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి వన్డేలో ఓడిన సౌతాఫ్రికా, రెండో వన్డేలో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయవంతంగా ఛేదించి సూపర్ విక్టరీని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. డిసెంబర్ 6న వైజాగ్లో జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. అయితే, 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా సులభం కాదు. దీనిని సౌతాఫ్రికా ఛేదించడం ప్రత్యర్థి బౌలింగ్ బలహీనతను స్పష్టం చేస్తోంది.

25
రెండో వన్డేలో వాడే విలన్
Image Credit : ANI

రెండో వన్డేలో వాడే విలన్

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా ప్రసిద్ద్ కృష్ణ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. పది ఓవర్లు పూర్తి చేసి ఉంటే సెంచరీ పరుగులు ఇచ్చేవాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రెండు వికెట్లు తీసినప్పటికీ, అతని పేలవమైన ఎకానమీ(ఓవర్‌కు 10 పరుగులకు పైగా) జట్టుకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. టీమిండియాకు ప్రసిద్ద్ కృష్ణ కంటే మెరుగైన బౌలర్లు లేరా అని అభిమానులు బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Related image1
టీమిండియా అతిపెద్ద బలహీనత అదే !
Related image2
KL Rahul: అదే మా కొంపముంచింది.. అందువల్లే మ్యాచ్ ఓడిపోయాం, ఓటమికి కారణం చెప్పిన కేఎల్ రాహుల్
35
ఆ ఇద్దరికీ రెస్ట్ ఇస్తే..
Image Credit : X/@BCCI

ఆ ఇద్దరికీ రెస్ట్ ఇస్తే..

బుమ్రా, సిరాజ్‌లకు విశ్రాంతి ఇవ్వగా, అర్ష్‌దీప్ సింగ్ వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ముగ్గురు మినహా టీమిండియాలో నిలకడగా రాణించే బౌలర్లు కనిపించడం లేదనే ఆందోళన నెలకొంది. హర్షిత్ రాణాను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చే ప్రయత్నంలో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. రెండో వన్డేలో హర్షిత్ రాణా కూడా ఓవర్‌కు ఏడు ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.

45
వారు లేకపోతే టీమిండియా బౌలింగ్ వేస్ట్
Image Credit : ANI

వారు లేకపోతే టీమిండియా బౌలింగ్ వేస్ట్

బుమ్రా, హార్దిక్ పాండ్యాల తర్వాత టీమిండియా బౌలింగ్ పరిస్థితి ఏంటో అంతుచిక్కట్లేదు. వీళ్లిద్దరూ ఎన్నేళ్లపాటు క్రికెట్ ఆడతారో తెలియదు. బౌలర్లను తయారు చేయడంలో ఎన్‌సీఏ, స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ దారుణంగా విఫలమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా విదేశీ బౌలర్లు, భారత స్పిన్నర్లు రాణిస్తున్నారే తప్ప, భారత పేసర్లు వైఫల్యం చెందుతున్నారు. రాణించిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా వంటి వారు మాత్రమే ఉన్నారు.

55
చేజింగ్ చేస్తేనే గెలుపు..
Image Credit : Getty

చేజింగ్ చేస్తేనే గెలుపు..

ఈ వన్డే సిరీస్‌లో భారత బౌలింగ్‌ పూర్తిగా తేలిపోతోందని చెప్పొచ్చు. బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా మారుతోంది. తొలి వన్డేలో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ రాణించి ఉంటే, ఆ మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోయేది. అదృష్టవశాత్తూ భారత్ ఆ మ్యాచ్‌లో గెలిచింది. మూడో వన్డేలో భారత్ గెలవాలంటే ఒకే ఒక మార్గం ఉంది: భారత్ ఛేజ్ చేయాలి. మరోసారి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం సిరీస్ సౌతాఫ్రికా చేతికి వెళ్ళడం ఖాయం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : పాకిస్థాన్ పనైపోయింది.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్
Recommended image2
Dasun Shanaka : దసున్ షనక ఊచకోత.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన లంక కెప్టెన్
Recommended image3
PAK vs SL : పిచ్చెక్కించిన షనక.. వణికిపోయిన షాహీన్ అఫ్రిది.. గెలిచినా ఏడ్చిన పాక్ ప్లేయర్లు!
Related Stories
Recommended image1
టీమిండియా అతిపెద్ద బలహీనత అదే !
Recommended image2
KL Rahul: అదే మా కొంపముంచింది.. అందువల్లే మ్యాచ్ ఓడిపోయాం, ఓటమికి కారణం చెప్పిన కేఎల్ రాహుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved