చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తాహిర్ పై ధోనీ జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తాహిర్ పై ధోనీ జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లలో అవతలి జట్టు వికెట్ పడితేచాలు.. ఇమ్రాన్‌ తాహిర్‌ సంబరాల్లో మునిగిపోతాడు. చేతులు విశాలంగా చాచి.. అభిమానుల గ్యాలరీ వైపు పరిగెత్తుతూ.. ఛాతి బాదుకుంటూ పరుగులు తీస్తుంటాడు. ఈ పరుగులపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ జోకులు పేల్చాడు.

తాజాగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీని చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయానంతరం ధోనీ మీడియాతో మాట్లడారు. ఆ సమయంలో తాహిర్ గురించి కూడా ధోనీ మాట్లాడారు. 

‘తాహిర్‌ సెలబ్రేషన్స్‌ చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, వికెట్‌ తీయగానే అతనికి దగ్గరికి వెళ్లకూడదని నాకు, వాట్సన్‌ చాలా బాగా తెలుసు. ఎందుకంటే వికెట్‌ పడగానే మరోవైపునకు అతను పరిగెత్తుకు వెళుతాడు. ఇది నాకు, వాట్సన్‌కు కొంత కష్టమే. మేం 100శాతం ఫిట్‌గా లేనప్పుడు అలా పరిగెత్తి అభినందించడం కూడా కొంచెం కష్టమే. అందుకే అతను సంబరాలు ముగించుకొని.. వెనక్కి వచ్చాక.. అతని దగ్గరికి వెళ్లి బాగా బౌలింగ్‌ చేశావని అభినందిస్తాం. మళ్లీ మా ఫీల్డింగ్‌ పొజిషన్‌కి వచ్చేస్తాం’ అని ధోనీ సరదాగా వివరించాడు.