టోక్యో ఒలింపిక్స్‌ 2021కి అర్హత సాధించిన తొలి భారత మహిళా స్విమ్మర్‌గా మానా పటేల్ రికార్డు...ఓవరాల్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొనే మూడో భారత స్విమ్మర్...  యూనివర్సిటీ కోటాలో ఒలింపిక్ బెర్త్...

యూనివర్సిటీ కోటా ద్వారా ఓ భారత స్విమ్మర్, టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది. బెల్‌గ్రేడ్‌లో జరిగిన 100 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటి, జాతీయ రికార్డు క్రియేట్ చేసిన మానా పటేల్, యూనివర్సిటీ కోటాలో ఒలింపిక్స్ 2021 పోటీల్లో పాల్గొనబోతోంది...

ఒలింపిక్స్‌లో యూనివర్సిటీ కోటా ద్వారా ఓ పురుష అథ్లెట్‌కి, ఓ మహిళా అథ్లెట్‌కి పాల్గొనే అవకాశం ఉంటుంది. 21 ఏళ్ల మానా పటేల్, బ్యాక్ స్టోక్ స్విమ్మర్‌గా జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకుంది.

Scroll to load tweet…

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే మూడో భారత స్విమ్మర్ మానా పటేల్. పురుషుల కేటగిరిలో ఇప్పటికే శ్రీహరి నటరాజన్, సజన్ ప్రకాశ్, ఒలింపిక్స్ 2021లో పాల్గొనబోతున్నారు. ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన మానా పటేల్‌కి భారత క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.