IND Vs NZ Semi-Final: వన్డే ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. నేడు హాట్ ఫేవరేట్ గా బరిలో దిగిన టీమిండియాకు న్యూజిలాండ్ జట్టుకు మధ్య హోరాహోరీ పోరు సాగనున్నది. ఇరు జట్ల మధ్య జరిగే ఈ తొలి సెమీస్ లో టీమిండియా, కివీస్ జట్లు ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది?  కెప్టెన్ రోహిత్ తన టీంలో ఎలాంటి మార్పులు చేయనున్నారు. న్యూజిలాండ్ జట్టులోకి డేంజరస్ ఆల్ రౌండర్ ఎంట్రీ ఇవ్వనున్నారంట.. ఇంతకీ ఆ డేంజరస్ ప్లేయర్ ఎవరు? 

IND Vs NZ Semi-Final: క్రికెట్ లవర్స్ ఎంతగానో ఇష్టపడుతున్న వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. వన్డే ప్రపంచకప్ సెమీస్ సమరం మరికొన్ని గంటల్లో షూరు కానున్నది. ఈ మహా టోర్నీలో విజయదుందుభి మోగిస్తున్న టీమిండియా నేడు న్యూజిలాండ్ తో తలపడనున్నది. కాగా.. నాలుగేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్దుదలతో ఉండగా.. ఎలాగైనా ఇండియాను ఓడించి.. ఫైనల్ పోరులో అడుగుపెట్టాలని కివీస్ భావిస్తోంది. ఈ ఉత్కంఠ పోరు ముంబైలోని వాంఖడే వేదికగా మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. 

కాగా..ఈ తొలి సెమీస్ లో టీమిండియా, కివీస్ జట్లు ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది? ఇరు జట్లలో ఏమైనా మార్పులు ఉన్నాయా? అనేది క్రికెట్ లవర్స్ లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు.. ఈ ఫీచ్ తొలుత బ్యాటింగ్ చేసేవారికి అనుకూలమని, ఛేజింగ్ కష్టమని భావిస్తున్న నేపథ్యంలో టాస్ కీలకంగా మారనున్నది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ తరుణంలో టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయకుండా విన్నింగ్ టీమ్‌నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అంటే.. శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ లను బెంచ్ కే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, షమీ త్రయం చాలా మంచి ఫాంలో ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు కూడా దూకుడు మీద ఉన్నారు. తన బౌలింగ్ తో టీమిండియాకు న్యాయం చేస్తున్నారు. ఈ తరుణంలో యంగ్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా లోటు కొట్టినట్టు కనిపిస్తోంది. 

ఇక అవసరమైతే.. ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్ ల్లో రోహిత్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శుభ్మన్ గిల్ ఉండనే ఉన్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఏ జట్టుకు లేని పటిష్టమైన బ్యాటింగ్ టీమిండియా సొంతం. ప్రతీ బ్యాట్స్ మెన్ తన పాత్రకు తగిన న్యాయం చేస్తున్నారు. దీంతో.. ఈ ఉత్కంఠ పోరులో రోహిత్ టీం ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడకపోవచ్చు.

మరోవైపు... గత రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరిన కివీస్ టీమ్ .. ఎలాగైనా టీమిండియాను ఓడించి.. మూడోసారి ఫైనల్ పోరులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీ లీగ్ దశలో కిందమీదపడుతూ సెమీస్ చేరిన కివీస్.

మరోవైపు.. కీలక ప్లేయర్లకు గాయాలు కావటంతో ఇబ్బంది పడిన కేన్ సేన.. సెమీస్ మ్యాచ్‌లో మాత్రం.. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఈ తరుణంలో జట్టులోకి డేంజరస్ ఆల్‌రౌండర్‌ను తీసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ గాయం కారణంగా దూరమైన జేమ్స్ నీషమ్ (James Neesham)ను ఈ కీలక సెమీస్ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మార్క్ ఛాప్ మన్ ను బెంచ్ కు పరిమితం చేసి.. జేమ్స్ నీషమ్‌ (James Neesham)ను టీంలోకి తీసుకోనున్నట్టు టాక్.

ప్రధానంగా.. ముంబై వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే ప్రిడిషన్స్ నేపథ్యంలో జేమ్స్ నీషమ్ (James Neesham)ను టీంలోకి తీసుకుని .. పవర్ హిట్టింగ్ ఉపయోగించాలని భావిస్తుందట కివీస్ టీమ్ మేనేజ్‌మెంట్. అలాగే ఈ పిచ్ పేసర్లకు సహకరిస్తుందంటూ అంచనాల నేపథ్యంలో పేస్ బౌలర్‌గానూ నీషమ్ (James Neesham) ఉపయోగపడతాడని న్యూజిలాండ్ టీమి అంచనా. ఈ పిచ్ మీద ఓపెనర్లుగా డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర వీరంగం చేయడం పక్కా.. వన్‌డౌన్‌లో వచ్చే.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా భారీ స్కోర్ చేయబోతారని అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి ఎన్ని వ్యూహాలు రచించినా.. సొంతగడ్డపై టీమిండియా గెలువడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.