న్యూజిలాండ్ లో ఓ క్లబ్ క్రికెట్ మ్యాచ్ లో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన హరీశ్ గంగాధరన్ అనే క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ గుండెపోటుకు గురైన హరీష్ మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలను కోల్పోయాడు.

భారత సంతతికి చెందిన హరీశ్(33)  ఐస్ ల్యాండ్ క్రికెట్ క్లబ్ సెకండ్ గ్రేడ్ టీం సభ్యుడు. అతడు  శనివారం తమ జట్టు తరపున సన్నీవాలే స్పోర్ట్స్ సెంటర్ లో ఓ మ్యాచ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా  బౌలింగ్ చేస్తున్న హరీష్ తీవ్ర ఛాతీనొప్పికి గురయ్యాడు. ఈ బాధతో విలవిల్లాడుతూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు.దీంతో మ్యాచ్ నిర్వహకులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.  చికిత్స పొందుతూ హరీశ్ మృతిచెందాడు.    

కేరళలోని కొచ్చిన్ కు చెందిన హరీష్ ఐదేళ్లక్రితమే నిషా అనే యువతిని పెళ్ళయింది. ఈ పెళ్లి తర్వాత భార్యను తీసుకుని హరీశ్ న్యూజిలాండ్ కు వెళ్లాడు. ప్రస్తుతం ఈ  పతులకు మూడేళ్ళ వయసున గౌరీ అనే కూతురు వుంది. 

హరీశ్ అకాల మృతి తమ జట్టు సభ్యులను ఎంతో కలచివేసిందని ఐస్ ల్యాండ్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ జాన్ మాలే ఆవేధన వ్యక్తం చేశాడు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు జాన్ తెలిపాడు.  ప్రస్తుతం హరీశ్ మృతదేహాన్ని ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.