ఆసియా క్రీడల్లో భారత్ సంచలనం...టీటీలో చారిత్రాత్మక విజయం

First Published 28, Aug 2018, 1:11 PM IST
Indian Men's TT Team Assures First Ever Medal in asian games
Highlights

ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారులు చారిత్రాత్మక విజయం  సాధించారు. క్వార్టర్ ఫైనల్లో  సత్యన్ జ్ఞానేశ్వర్, హర్మీత్ దేశాయ్, ఆంథోని అమల్ రాజ్, శరత్ కమల్ లతో కూడిన భారత జట్టు విజయం సాధించింది. దీంతో కనీసం కాంస్యం ఖాయమైంది. ఇలా ఆసియా క్రీడల చరిత్రలో టీటీ విభాగంలో భారత్ కు పతకం లభించడం ఇదే మొదటిసారి.

క్వార్టర్ ఫైనల్ తొలి మ్యాచ్ లో సత్యన్ జ్ఞానేశ్వర్ 11-9, 11-9, 11-7 తేడాతో జపాన్ క్రీడాకారుడు జిన్ పై గెలుపొందాడు. రెండో మ్యాచ్ లో శరత్ 11-8,12-10,11-8 తేడాతో ముసుదైరా పై నెగ్గాడు. మూడో మ్యాచ్ లో హర్మీత్ కాస్త నిరాశ పరిచాడు. ఇతడు జపాన్కు చెందిన మసాకి చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో భారత్ ఆధిక్యం 2-1 కి చేరింది. అయితే నిర్ణయాత్మక నాలుగో మ్యాచ్ లో జ్ఞానేశ్వర్ 12-10, 6-11, 11-7,  11-4 మళ్లీ కెంటాను ఓడించి 3-1 తేడాతో గెలుపొందారు.

1958 నుండి జరుగుతున్న ఈ ఆసియా క్రీడల్లో టీటీలో భారత్ ఓ పతకం సాధించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే సెమీస్ కు చేరిన భారత్ జట్టు కాంస్యం ఖాయం చేసుకుంది. సెమిఫైనల్లో దక్షిణ కొరియా జట్టుతో భారత్ తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టనుంది.  
 
loader