వెళ్లి, పసిడి పట్టుకురండి... ఒలింపిక్స్‌లో వెళ్లే భారత అథ్లెట్లకుక్రికెటర్ల విషెస్...
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు అండగా నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ‘ఛీర్4 ఇండియా’ ప్రోగ్రామ్...
టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లే భారత అథ్లెట్లకు, టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియచేశారు. భారత్ నుంచి విశ్వక్రీడలకు వెళ్లే క్రీడాకారులు, పసిడి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, విషెస్ తెలిపారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో భారత పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు, మహిళా టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్, క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింకా రహానే, జెమీమా రోడ్రిగ్స్, హార్లీన్ డియోల్... ‘ఛీర్4 ఇండియా’ అంటూ అథ్లెట్లకు ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు...
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు అండగా నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘ఛీర్4 ఇండియా’ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం గర్వంగా ఉందంటూ బీసీసీఐ, ఈ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది...
భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్, మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్... ఒలింపిక్స్ ఈవెంట్స్‌లో భారత పతకాన్ని చేపట్టి టీమిండియాను లీడ్ చేయబోతున్నట్టు ఇండియన్ ఒలింపక్ అసోసియేషన్ తెలియచేసింది. ముగింపు వేడుకల్లో భారత పతకాన్ని భారత రెజ్లర్ భజరంగ్ పూనియా చేపట్టనున్నాడు..
ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి 126 అథ్లెట్లు, 75 అధికారులు టోక్యోకి బయలుదేరి వెళ్లనున్నారు. కరోనా కేసుల కారణంగా టోక్యోలో ఎమర్జెన్సీ విధించడంతో ఈసారి ప్రేక్షకులు లేకుండానే విశ్వక్రీడా సమరం జరగనుంది...