విండీస్ తో జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా విజయం సాధించింది. వర్షం పడినప్పటికీ... విజయం టీం ఇండియానే వరించింది. అయితే.... ఈ మ్యాచ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు తమ ప్రదర్శన కనపరచడంలో విఫలమయ్యారు. కాగా... దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.

ఈ మ్యాచ్ లో తాను సెంచరీ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. రోహిత్, శిఖర్ ధావన్ సరిగా ఆడలేకపోయారని.. దీంతో.. తనకు ఆట ఆడే అవకాశం లభించిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అవ్వడంతో జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని కోహ్లీ  ఈ సందర్భంగా వివరించాడు.

ముందే బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా తమ విజయానికి ఒక కారణమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.  రెండో ఇన్నింగ్స్ లో  విండీస్ బ్యాటింగ్ చేస్తుండగా పిచ్ నెమ్మదించిందని.. దీంతో వారు బ్యాటింగ్ సరిగా చేయలేకపోయారని చెప్పాడు. కీలక సమయంలో హెట్ మేయర్, నికోలస్ వికెట్లు తీయడం తమకు కలిసివచ్చిందని చెప్పాడు.

విండీస్ జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి బ్యాట్స్ మెన్స్ ఎక్కువగా ఉండటం వల్లనే చాహల్ కి బదులు కులదీప్ ని జట్టులోకి తీసుకున్నట్లు వివరించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడంటూ ఈ సందర్భంగా కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. శ్రేయాస్  లో ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉందని... అతను తోడుగా ఉండటం వల్లనే తనపై ఒత్తిడి కాస్త తగ్గిందని కోహ్లీ చెప్పాడు.