ఆసియాకప్‌లో భాగంగాపాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌ పట్టాడు. కేదార్‌ జాదవ్‌ బౌలింగులో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్ కు ప్రయత్నించాడు.

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగాపాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌ పట్టాడు. కేదార్‌ జాదవ్‌ బౌలింగులో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని గాలిలోనే అందుకునే ప్రయత్నం చేశాడు.

ఆ ప్రయత్నంలో బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్‌ను దాటి వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో సర్ఫరాజ్‌ (6) పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో లేని పాండే ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా గాయపడటంతో అతని స్థానంలో ఫీల్డింగ్‌కు వచ్చాడు. 

వికెట్ల వద్ద పాతుకుపోయిన షోయబ్ మాలిక్‌(43)ను అంబటి రాయుడు అద్బుతమైన ఫీల్డింగ్‌తో పెవిలియన్‌కు పంపించాడు. జాదవ్‌ వేసిన 27వ ఓవర్‌ చివరి బంతికి మాలిక్‌ (43) పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌ అయ్యాడు. రాయుడు విసిరిన బంతి డైరెక్ట్‌గా వికెట్లను తాకింది.