Asianet News TeluguAsianet News Telugu

ఐదో వన్డే: పోరాడిన న్యూజిలాండ్...వెల్లింగ్టన్‌లో భారత్ విజయం

వెల్లింగ్టన్ వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. టీమిండియా నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాటం చేసింది. అయితే భారత బౌలర్లను ఎదుర్కోలేక 44.1 ఓవర్లో 217 పరుగులకు అలౌటైంది.  

india vs newzealand 5th odi live updates
Author
Wellington, First Published Feb 3, 2019, 10:06 AM IST

వెల్లింగ్టన్ వన్డేలో భారత్ 35 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. టీమిండియా నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో న్యూజిలాండ్ చివరి వరకు పోరాటం చేసింది.

అయితే భారత బౌలర్లను ఎదుర్కోలేక 44.1 ఓవర్లో 217 పరుగులకు అలౌటైంది.  జేమ్స్ నీషమ్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అతను రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది.

చివరి వరుస బ్యాట్స్‌మెన్ పోరాడినప్పటికీ, ఒత్తిడి ఎదుర్కోలేక వరుసపెట్టి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో చాహల్ 3, షమీ, పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ 5 వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్ 8వ వికెట్ కోల్పోయింది. టోడ్ ఆస్లే 10 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విజయానికి న్యూజిలాండ్ ఇంకా 58 పరుగులు చేయాల్సి ఉంది.

భారత బౌలర్లకు చుక్కలు చూపించి న్యూజిలాండ్‌ను విజయానికి దగ్గర చేసిన జేమ్స్ నీశమ్‌ ఔటయ్యాడు. 32 బంతుల్లో 44 పరుగులు చేసిన నీశమ్‌ను  ధోనీ రనౌట్ చేశాడు. దీంతో కివీస్ 7వ వికెట్ కోల్పోయింది. 

న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. ఆల్ రౌండర్ గ్రాండ్ హోమ్ చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విజయానికి కివీస్ ఇంకా 91 పరుగుల దూరంలో ఉంది. 

కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి భారత బౌలర్లను ప్రతిఘటించిన వికెట్ కీపర్ లాథమ్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ మాయాజాలానికి లాథమ్ బలయ్యాడు. 

కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేదార్ జాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కివీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ఊపుమీదున్న మున్రోను షమీ పెవిలియన్ చేర్చగా.. ఆ తర్వాతి ఓవర్‌కే ప్రమాదకర రాస్ టేలర్‌ను పాండ్యా ఔట్ చేశాడు. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. కెప్టెన్ విలియమ్సన్ , టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు.

కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో ఓపెనర్ హెన్రీ నికోలస్ పెవిలియన్ చేరాడు. 

వెల్లింగ్టన్‌లో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ .. న్యూజిలాండ్ ముందు 253 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముందు కివీస్ బౌలర్లు విజృంభించి పట్టు బిగించినా తర్వాత వారు దానిని నిలబెట్టుకోలేకపోయారు.

అంబటి రాయుడు, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, హార్డిక్ పాండ్యా చివర్లో బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు అలౌటైంది. కివీస్ బౌలర్లలో హెన్రీ 4, బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టారు.

టీమిండియా 7వ వికెట్ కోల్పోయింది. సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్న కేదార్ జాదవ్‌ 34 పరుగుల స్కోరు వద్ద హెన్రీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత్ 6వ వికెట్ కోల్పోయింది. 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెన్రీ బౌలింగ్‌లో రాయుడు పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో కేదార్ జాదవ్, హార్డిక్ పాండ్యా ఉన్నారు. 

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఆదిలోనే రోహిత్ శర్మ, ధావన్‌ల వికెట్లను పొగొట్టుకున్న టీమిండియా ఆ తర్వాత కొద్దిసేపటికే కొత్త కుర్రాడు శుభమన్ గిల్‌ను సైతం కోల్పోయింది.

ఆ తర్వాత విజయ్ శంకర్-అంబటి రాయుడుల జోడీ మరో వికెట్ పడకుండా సంయమనంతో ఆడింది. వీరిద్దరూ 5 వ వికెట్‌కు 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలో విజయ్ శంకర్ రనౌట్ అవ్వడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో అంబటి రాయుడు, కేదార్ జాదవ్ వున్నారు. అంతకు ముందు టాస్ గెలిచన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios