టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే ప్రంపంచ క్రికెట్ లో ఇప్పుడు తెలియనివారుండరు. తన భీకరమైన ఆటతీరుతోనే కాదు...అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఫార్మాట్ ఏదైనా...అందులో తన మార్కు బ్యాటింగ్ తో చెలరేగడం విరాట్ స్పెషాలిటీ. దీంతో చాలాకాలంగా ఐసిసి ప్రకటిస్తున్న టెస్ట్, వన్డే బ్యాట్‌మెన్స్ ర్యాకింగ్స్ లో టాప్ లో కొనసాగుతున్న విరాట్... టీ20 ర్యాకింగ్స్ లో మాత్రం టాప్ లోకి రాలేకపోతున్నాడు. ఇటీవల ఐసిసి ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టాప్ టెన్ లో కూడా విరాట్ కు స్థానం లభించలేదు. ఇది క్రికెట్ అభిమానులకు...మరీ ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు భాదిస్తోంది.

ఇటీవల స్వదేశంలో వెస్టిండిస్ తో జరిగిన టీ20 సీరిస్ నుండి సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అలాగే ఆసిస్ తో జరిగిన టీ20 సీరిస్ లో కూడా కోహ్లీ ఆశించిన మేర  రాణించలేకపోయాడు. దీంతో తాజాగా ప్రకటించిన ఐసిసి ర్యాకింగ్స్ లో వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో టాప్ లో నిలిచిన కోహ్లీ టీ20 లో మాత్రం టాప్ టెన్ లో కూడా స్థానం దక్కించుకోలేదు. అతడు ఏకంగా 14 వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.     

 ఐసిసి టెస్ట్ బ్యాట్ మెన్స్ ర్యాంకింగ్స్ లో 934 పాయిట్లతో విరాట్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. రెండో స్థానంలో నిలిచిన న్యూజిల్యాండ్ ఆటగాడు విలియమ్సన్ కంటే కోహ్లీకి 19 పాయింట్లు ఎక్కువగా వున్నాయి. ఇక వన్డేల విషయానికి వస్తే 899 పాయింట్లో కెప్టెన్ కోహ్లీ మొదటి స్థానంలొ ఉండగా, వైస్ కెప్టెన్ రోహిత్ 871 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. టీ20 ల్లో మాత్రం రోహిత్ 689 పాయింట్లతో 9 వ స్ధానంలో నిలవగా, కోహ్లీ 636 పాయంట్లతో 14వ స్ధానంలో నిలిచాడు. అతడి కంటే ముందు మరో టీంఇండియా ఆటగాడు శిఖర్ ధావన్ 681 పాయింట్లతొ 11వ స్థానంలో నిలిచాడు.