Asianet News TeluguAsianet News Telugu

నేను అలా అనుకున్నా,కానీ .. ఓటమి పై దినేశ్ కార్తీక్

 భారీ షాట్లు ఆడగలిగే కృనాల్‌ పాండ్యా సగం పిచ్‌ దాటేసి పరుగెత్తుకుంటూ వచ్చినా.. దినేశ్‌ కార్తీక్‌ వద్దంటూ సింగిల్‌కు నిరాకరించడం చర్చనీయాంశమైంది. .

I genuinely believed that I could hit a six, says Dinesh Karthik on refusing single in final over loss against New Zealand
Author
Hyderabad, First Published Feb 14, 2019, 12:29 PM IST

గెలవడం.. ఓడిపోవడం ఆటలో చాలా కామన్ విషయాలని టీం ఇండియా క్రికెటర్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల న్యూజిలాండ్‌తో ఆఖరిదైన మూడో టీ20లో టీమిండియా గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కివీస్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 208 పరుగులు మాత్రమే చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 

ఆ మ్యాచ్‌ గెలవాలంటే చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాలి. మూడో బంతికి తేలిగ్గా సింగిల్‌ వచ్చే అవకాశమున్నా దినేశ్‌ కార్తీక్‌ పరుగు తీయలేదు. భారీ షాట్లు ఆడగలిగే కృనాల్‌ పాండ్యా సగం పిచ్‌ దాటేసి పరుగెత్తుకుంటూ వచ్చినా.. దినేశ్‌ కార్తీక్‌ వద్దంటూ సింగిల్‌కు నిరాకరించడం చర్చనీయాంశమైంది. దానిపై దినేశ్‌ కార్తీక్‌పై అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

కాగా.. ఈ విషయంపై తాజాగా దినేష్ కార్తీక్ స్పందించారు. ఆ సమయంలో తాను కృనాల్ బాగా బ్యాటింగ్ చేస్తున్నామని చెప్పాడు. కచ్చితంగా లక్ష్యాన్నిచేధించి గెలుస్తామనే ధీమాతో ఉన్నట్లు చెప్పాడు. సిక్స్ కొట్టగలననే నమ్మకంతోనే సింగిల్ వద్దని చెప్పినట్లు వివరించాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల నా సామర్థ్యాన్ని తాను నమ్మాలని.. భాగస్వామిని నమ్మడం కూడా ముఖ్యమన్నాడు. అయితే తాను అనుకున్నట్లుగా ఆడలేకపోయానని క్రికెట్‌లో  ఇలాంటివన్నీ సహజమని చెప్పుకొచ్చాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios