ఆసియా ఖండంలో అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ పై బిజినెస్ అంటే వందల కోట్లు దాటాల్సిందే. ముఖ్యంగా వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఉండే ఆధారణే వేరు. అందులోను ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అంటే బ్రాడ్ క్యాస్ట్ ఛానెల్స్ కు కాసుల వర్షం కురిసినట్టే. అయితే ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఛానల్ కి నష్టాలు తప్పవు. 

పాకిస్థాన్ - భారత్ మ్యాచ్ గనక రద్దయితే స్టార్ స్పోర్ట్స్ కి కూడా భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్ లు రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్ లు వర్షార్పణం కావడం వల్ల నిర్వాహకులకు 180కోట్ల వరకు నష్టం కలిగినట్లు సమాచారం. ఇక స్టార్ స్పోర్ట్స్ కి కూడా 100కోట్ల వరకు నష్టం వాటిల్లింది. 

ఇప్పుడు భారత్ - పాక్ మ్యాచ్ గనక రద్దయితే 140కోట్లు వర్షం పాలైనట్లే. ముందు జాగ్రత్తగా ఛానెల్ ఇన్సూరెన్స్ చేయించినప్పటికీ ఈ స్థాయిలో నష్టపరిహారం కట్టడానికి భీమా కంపెనీలకు వీలు పడటం లేదు. కోకాకోలా, ఉబర్‌, వన్‌ప్లస్‌, ఎమ్మారెఫ్‌ టైర్స్‌ వంటి ప్రముఖ  కంపెనీలు యాడ్స్ కోసం స్టార్ స్పోర్ట్స్ తో డీల్ సెట్ చేసుకున్నాయి. 

సాధారణంగా ఒక మ్యాచ్ ప్రసరమయ్యేటప్పుడు సెకనుకు  1.6 నుంచి 1.8 లక్షల వరకు  రేటు ఫిక్స్ చేశారు. అయితే ఇండియా - పాక్ మ్యాచ్ కు మాత్రం ఆ రేట్ డబుల్ అయ్యింది. సెకనుకు అడ్వర్టైజింగ్‌ ధర రూ.2.50లక్షల వరకు పలుకుతోంది.