పాక్ ప్లేయర్స్ తో ఎదుర్కొన్న కొన్ని పరిస్థితుల గురించి హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. పాక్ ప్లేయర్స్ తో ఇండియన్ ప్లేయర్స్ అంతా ఎంతో సరదాగా ఉంటారని షాహిద్ - అక్తర్ తనకు మంచి స్నేహితులని తెలిపాడు. అయితే 2003లో దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ లో పాక్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ తో జరిగిన గొడవ గురించి వివరణ ఇచ్చాడు. 

ఆ గొడవ ఎంత సీరియస్ గా మారిందంటే.. చిన్న జోక్ తో మొదలయ్యి చివరకు ఫోక్స్ పట్టుకొని ఫైట్ చేసేంత సీరియస్ గా మారింది. చివరకు రాహుల్ ద్రావిడ్ - పాక్ సీనియర్ క్రికెటర్స్ ఆపాల్సి వచ్చిందని హర్భజన్ తెలియజేశాడు. 

ఒక టేబుల్ వద్ద నేను కూర్చొని భోజనం చేస్తుండగా పక్క టేబుల్ లో షోయబ్ అక్తర్ - మహమ్మద్ యూసుఫ్ కూర్చున్నారు. అప్పుడు చిన్న జోక్ తో ఇద్దరి మధ్య సంభాషణ పెరిగింది. ఈ క్రమంలో అతను మతంపై కామెంట్ చేశాడు, నేను ధీటుగా సమాధానం ఇచ్చాను. మాటామాట పెరగడంతో ఇద్దరం ఫోక్స్ తో గొడవకు సిద్దమయ్యాం. ఇంతలో రాహుల్ ద్రావిడ్ - శ్రీనాథ్ నన్ను పక్కకు తీసుకెళ్లి మందలించారు. యూసుఫ్ ను వసీమ్ భాయ్ - సయీద్ పక్కకు తీసుకెళ్లారు. 

ఇరు జట్ల సీనియర్ క్రికెటర్స్ మా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అని 16 ఏళ్ల కిందట జరిగిన గొడవను హర్భజన్ గుర్తు చేసుకున్నాడు. అయితే ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు దాన్ని గుర్తు చేసుకొని తాము సరదాగా నవ్వుకుంటామని  తెలియజేశాడు.