విహారి అర్థసెంచరీ.. తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసిన ఆంధ్రా కుర్రాడు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 9, Sep 2018, 5:16 PM IST
hanuma vihari half century in last test
Highlights

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి అర్థశతకం సాధించాడు. 104 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో విహారి హాఫ్ సెంచరీ చేశాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా కుర్రాడు హనుమ విహారి అర్థశతకం సాధించాడు. 104 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో విహారి హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్థశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.

ఓవల్‌లో జరుగనున్న చివరి మ్యాచ్ కోసం పాండ్యాపై వేటు వేసి విహారికి అవకాశం ఇచ్చింది టీమ్ ఇండియా. దీంతో భారత్ తరపున టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన 292వ క్రికెటర్‌గా విహారి నిలిచాడు. అంతేకాకుండా ఆంధ్రా తరపున జాతీయ టెస్టు జట్టుకి ఆడుతున్న మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు సీకే నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్రా నుంచి ఎంపికయ్యారు. 

loader