Asianet News TeluguAsianet News Telugu

అందుకే జుట్టు ఊడిపోయింది.. హనుమ విహారి సెటైర్

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి సలహాలు, సూచనల వల్లే తాను ఈ మ్యాచ్‌లో రాణించగలిగానని పేర్కొన్నాడు. అదే విధంగా అజింక్య రహానే తనకు అండగా నిలబడి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సహాయపడ్డాడని తెలిపాడు. తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందని చెప్పాడు.
 

hanuma vihari credits Ravi Shastri's advice to flex Kness for success in West Indies
Author
Hyderabad, First Published Sep 4, 2019, 9:48 AM IST

టీం ఇండియా యువ క్రికెటర్ హనుమ విహారి తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు. అతి చిన్న వయసులోనే అతని జట్టు ఊడిపోవడంపై కామెంట్ వేశాడు. కొన్ని సంవత్సరాలుగా బ్యాటింగ్ మాత్రమే చేయడం వల్లే తన జట్టు ఊడిపోయిందేమో అంటూ సరదాగా పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్  తెలుగు క్రికెటర్ హనుమ విహారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. స్వదేశంలో కూడా టెస్టు మ్యాచ్ ఆడాలని ఆసక్తిగా ఉందని చెప్పాడు. తన కెరిర్ లో తొలి టెస్టు మ్యాచ్ లోనే సెంచరీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు.

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి సలహాలు, సూచనల వల్లే తాను ఈ మ్యాచ్‌లో రాణించగలిగానని పేర్కొన్నాడు. అదే విధంగా అజింక్య రహానే తనకు అండగా నిలబడి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సహాయపడ్డాడని తెలిపాడు. తొలి టెస్టు సెంచరీ సాధించడం చాలా గొప్పగా అనిపిస్తోందని చెప్పాడు.

చివరి మ్యాచ్ లో సెంచరీ చేయలేకపోయానని.. అందుకే ఈ మ్యాచ్ లో మరింత జాగ్రత్తగా ఆడి సెంచరీ చేశానని  చెప్పాడు.  బౌలర్లకు పిచ్‌ అనుకూలిస్తున్న సమయంలో చెత్త బంతి కోసం ఎదురు చూడాలని చెప్పాడు.  రెండో ఇన్నింగ్స్‌లోనూ మా ప్రణాళిక బాగా పని చేసిందన్నాడు. తన బ్యాటింగ్‌ స్టాన్స్‌ మార్చుకునే విషయంలో కోచ్‌ రవిశాస్త్రి కొన్ని సూచనలు చేశారని.. అవి బాగా పని చేశాయన్నాడు.ఒత్తిడిలో ఆడటాన్ని నేను ఇష్టపడతానని.. అదే మనలోని అసలు సత్తాను బయటపెడుతుందని చెప్పాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios