స్వదేశంలో జరిగిన వన్డే సీరిస్‌లో న్యూజిలాండ్ టీంఇండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన టీ20 సీరిస్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని వ్యూహాలు రచిస్తున్న కివీస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీరిస్‌లో భాగంగా జరిగే మూడు టీ20 మ్యాచ్ లకు కీలక ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. 

వెన్ను నొప్పి కారణంగా న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్ ఆదివారం జరిగిన చివరి వన్డేకు దూరమయ్యాడు. ఈ నొప్పి మరికొద్దిరోజులు కూడా తగ్గే పరిస్థితి లేకపోవడంతో భారత్ తో జరిగే టీ20 సీరిస్ నుండి అతడు వైదొలిగాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో జేమ్స్ నీషమ్ కు అవకాశం కల్పించారు. 

న్యూజిలాండ్-భారత్ ల హత్య టీ 20 సీరిస్ కేవలం ఐదు రోజుల వ్యవధిలో ముగియనుందని...అంత తక్కువ సమయంలో గప్టిల్ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్‌ పేర‍్కొన్నాడు. అతడు గాయం కారణంగా ఇలా సీరిస్ మొత్తానికి దూరం కావడం దురదృష్టకరమన్నాడు.భారత్ తో టీ20 సీరిస్ తర్వాత బంగ్లాదేశ్ తో జరగనున్న వన్డే సీరిస్ లో గప్టిల్ మళ్లీ జట్టులోకి వస్తాడని గ్యారీ స్పష్ట చేశాడు. 

స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సీరిస్ ను న్యూజిలాండ్ 4-1 తేడాతో భారత్ చేతిలో కోల్పోయి ఘోర పరాభవాన్ని పొందింది. దీనికి ప్రతీకారంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే 3 టీ20 మ్యాచ్ ల సీరిస్ లో భారత ఆటగాళ్ళను కట్టడిచేయడానికి కివీస్ వ్యూహరచన చేస్తోంది. ఈ సమయంలో ఇలా కీలక ఆటగాడు జట్టుకు దూరమవడం ఆ జట్టు మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. 

బుధవారం (ఫిబ్రవరి6వ తేదీన) వెల్లింగ్టన్‌ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8వ తేదీన ఆక్లాండ్‌ వేదికగా రెండో టీ20 , ఫిబ్రవరి 10వ తేదీన హామిల్టన్‌ వేదికగా మూడో టీ20మ్యాచ్ లు జరగున్నాయి. 

Scroll to load tweet…